Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
చెన్నై క్వీన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. త్రిష పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ మధురైలో వెలిసిన కొన్ని బ్యానర్లు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సభలో త్రిష పేరుతో అభిమానులు నినాదాలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Entertainment | Published On Aug 3, 2026, 6.34 pm IST
Trisha | త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తమిళనాట చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ అడుగు జాడల్లోనే చెన్నై క్వీన్ నడవబోతుందని అంటున్నారు. అధికార టీవీకే పార్టీలో త్రిష జాయిన్ కానుందని, దళపతి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక టైమ్‌లో తమిళనాడు డిప్యూటీ సీఎంగా త్రిషనే పదవి చేపట్టే అవకాశం ఉందని అన్నారు. ఈ వార్తలపై త్రిష మాత్రం సైలెంట్‌గానే ఉంటూ వస్తోంది. అవునని చెప్పకపోవడం, కాదని ఖండించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
తమిళ వీర వనిత...
తాజాగా త్రిష పాలిటిక్స్‌లోకి రావాలంటూ పిలుపునిస్తూ తమిళనాడులో ఆమె అభిమానులు బ్యానర్లు కట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో తమిళ వీర వనిత వేలు నాచియార్‌తో త్రిషను పోల్చారు ఆమె ఫ్యాన్స్. "ప్రతి రాజకీయ పార్టీ తొలి అడుగు మధురై నుంచే పడిందని, త్రిష ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలు కావాలంటూ" ఈ బ్యానర్ల ద్వారా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన మొదటి సంఘంగా మధురై జిల్లా త్రిష ఫ్యాన్స్ క్లబ్ నిలిచిందని పేర్కొన్నారు.
తెరపైకి...
ఈ బ్యానర్లతో మరోసారి త్రిష పొలిటికల్ ఎంట్రీ వార్తలు తెరపైకి వచ్చాయి.మధురై నుంచే త్రిష తన రాజకీయ ప్రయాణంపై ఓ ప్రకటన ఉండొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే త్రిష ఫ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి త్రిష కూడా అటెండ్ కాబోతున్నట్లు చెబుతున్నారు. ఆ సేవా కార్య్రమంలోనే తన రాజకీయ అరంగేట్రంపై త్రిష ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. తాను రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే పార్టీ అభ్యర్థి ఎవరన్నది విజయ్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో త్రిషనే ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.
ఉదయనిధి స్టాలిన్ సభలో...
తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సభ కూడా త్రిష నినాదాలతో దద్దరిల్లింది. టీవీకే ప్రభుత్వ పాలనను వ్యతిరేకంగా ఉధయనిధి స్టాలిన్ చెన్నైలో బహిరంగసభను ఏర్పాటుచేశాడు. త్రిష..త్రిష అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ పదే పదే సభకు ఆటంకం కలిగించారు. ఉధయనిధి స్టాలిన్ కంటే ఈ సభలో త్రిష పేరే ఎక్కువగా వినిపించిందని తమిళనాట ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay vs MK Stalin | పరిపాలన చేతగాని డమ్మీ ముఖ్యమంత్రివి నువ్వు : ఉదయనిధి అరెస్ట్‌పై ఎంకే స్టాలిన్ ఫైర్
ఆగస్టు 4, 2026

Chinmayi | జయలలితనూ అవమానించారు – త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, ఖుష్బూ డిమాండ్
ఆగస్టు 4, 2026

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ – ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు – తెలుగులో స్ట్రీమింగ్
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
- ●Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
- ●Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
- ●BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!

JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..

Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క



