OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ – థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్
రవిబాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రేజర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 19 నుంచి ఆహా ఓటీటీలో ఈ వయలెంట్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మే ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డును మూటగట్టుకుంది.
Entertainment | Published On Jun 15, 2026, 8.32 pm IST
OTT | టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు హీరోగా నటించిన రేజర్ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. మే ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డును మూటగట్టుకుంది. కనీసం ప్రమోషన్స్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. రేజర్ మూవీలో ఇనయా సుల్తానా, తనీష్, బెనర్జీ, మీనా వాసు ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి రవిబాబు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా రేజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 19 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
రేజర్ గతం ఏమిటి?
సీఎం దారుణ హత్యకు గురవుతాడు. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన హోమంత్రి అతడిని చంపిస్తాడు. సీఎంను హత్య చేసిన వీడియో ఒకటి విష్ణుకు దొరుకుతుంది. దాంతో విష్ణును కూడా హోమంత్రి మనుషులు చంపేస్తారు. విష్ణు కూతురు తేజును రేజర్ కాపాడుతాడు. అసలు రేజర్ ఎవరు? తేజును చంపాలని వచ్చిన హోమంత్రి మనుషులను రేజర్ ఎలా ఎదుర్కొన్నాడు? పెట్ ట్రైనర్‌గా పనిచేసే రేజర్ గతం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
డైరెక్టర్‌గా...యాక్టర్‌గా...
అమ్మాయిలు అబ్బాయిలు మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రవిబాబు, నచ్చావులే, అనసూయ, అవును, మనసారా లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మురారి, తొలి ప్రేమ, చాలా బాగుంది, రచ్చ, స్వామి రారాతో పాటు వందకుపైగా సినిమాల్లో నటించాడు.
సంబంధిత వార్తలు

Malavika Mohanan | ఇప్పుడు రిజెక్ట్ – ఇప్పుడు రొమాన్స్ – మాస్ మహారాజా మల్టీస్టారర్‌లో రాజాసాబ్ హీరోయిన్
జులై 19, 2026

Nivetha Thomas | రెండేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ – లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా థామస్ – టైటిల్ ఇదే!
జులై 19, 2026

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026
తాజావార్తలు
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- ●IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!



