త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | బేబీ బంప్‌తో ర‌ష్మిక – ర‌ణ‌బాలికి ప్యాక‌ప్ చెప్పిన జ‌య‌మ్మ‌

ర‌ణ‌బాలి మూవీ షూటింగ్‌ను ర‌ష్మిక మంద‌న్న పూర్తిచేసింది. చిత్ర‌బృందానికి వీడ్కులు ప‌లుకుతూ ఎమోష‌న‌ల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ర‌ష్మిక బేబీ బంప్‌తో క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

N

Entertainment | Published On Sep 14, 2026, 11.43 am IST

Rashmika Mandanna | బేబీ బంప్‌తో ర‌ష్మిక – ర‌ణ‌బాలికి ప్యాక‌ప్ చెప్పిన జ‌య‌మ్మ‌
Advertisement

Rashmika Mandanna |  పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ జంట‌గా క‌లిసి న‌టిస్తున్న మూవీ ర‌ణ‌బాలి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 1870 ద‌శ‌కంలో బ్రిటీష్ పాల‌కుల అకృత్యాల‌ను ఎదురించి పోరాడిన రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ యోధుడి క‌థ‌తో ర‌ణ‌బాలి తెర‌కెక్కుతోంది.

ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి...

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న ర‌ణ‌బాలి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సెప్టెంబ‌ర్‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. మైసా షూటింగ్ ర‌ష్మిక మంద‌న్న గాయ‌ప‌డ‌టంతో ద‌స‌రాకు వాయిదా ప‌డింది. కాగా ర‌ణ‌బాలి మూవీలో త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ను ర‌ష్మిక పూర్తిచేసింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ మేక‌ర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ర‌ష్మిక ప్రెగ్నెన్సీతో క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఈ వీడియోలో చిత్ర‌బృందానికి ర‌ష్మిక వీడ్కోలు ప‌లుకుతూ ఎమోష‌న‌ల్ అయ్యింది. భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కౌగిలించుకుంది. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

జ‌య‌మ్మ‌...

ర‌ణ‌బాలిలో జ‌య‌మ్మ అనే పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతుంది. ఇందులో విజ‌య్‌, ర‌ష్మిక భార్యాభ‌ర్త‌లుగా న‌టిస్తున్నారు. హాలీవుడ్ న‌టుడు అర్నాల్డ్ వోస్లో విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అజ‌య్ - అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ వారంలోనే ర‌ణ‌బాలి షూటింగ్ మొత్తం పూర్తికానున్న‌ట్లు స‌మాచారం.

మైసా...

ర‌ణ‌బాలితో పాటు తెలుగులో మైసా సినిమా చేస్తోంది ర‌ష్మిక‌. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీ న‌వంబ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఎంఎస్‌సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో హీరోయిన్‌గా ర‌ష్మిక క‌న్ఫామ్ అయ్యింది.

Advertisement
Advertisement