Rashmika Mandanna | నక్సలైట్‌గా నేషనల్ క్రష్ – ఊహించని జానర్‌లో రష్మిక తెలుగు మూవీ
తెలుగులో మరో కొత్త ప్రయోగానికి నేషనల్ క్రష్ సిద్ధమైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక నక్సలైట్ పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం.
Entertainment | Published On Jun 18, 2026, 10.20 am IST
Rashmika Mandanna | కమర్షియల్ హీరోయిన్ అనే ట్యాగ్ నుంచి దూరమయ్యే ప్రయత్నాల్లో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. పాత్రల పరంగా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. భర్త విజయ్ దేవరకొండతో చేస్తోన్న రణబాలిలో జయమ్మగా డీ గ్లామర్ రోల్ చేస్తోంది రష్మిక మందన్న. తాజాగా తన నెక్స్ట్ తెలుగు మూవీలో ఊహించని రోల్‌తో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నదట నేషనల్ క్రష్. నక్సలైట్ పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం.
లేడీ ఓరియెంటెడ్ మూవీ...
రష్మిక మందన్న హీరోయిన్‌గా తెలుగులో మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ జానర్‌లో రష్మిక చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. ఇందులో గోండు జాతి యువతిగా రష్మిక నటిస్తుంది. మైసా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఇందుకోసం బ్యాంకాక్ వెళ్లింది.
నక్సలైట్‌గా....
కాగా మైసాలో రష్మిక నక్సలైట్ పాత్రలో నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. గోండు జాతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా నక్సలిజం బాట పట్టిన యువతిగా పవర్‌ఫుల్ రోల్‌లో రష్మిక కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. మైసా సెకండాఫ్ మొత్తం నక్సలిజం నేపథ్యంలోనే సాగుతుందట. ఈ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా ఎమోషనల్‌గా కూడా సినిమాలో చాలా హై మూవ్‌మెంట్స్ ఉంటాయని అంటున్నారు. నక్సలైట్‌గా రష్మిక ట్రాన్స్‌ఫర్మేషన్, మేకోవర్, ఆమెపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోతాయని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ నక్సలైట్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి కానుండటంతో మైసాపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
ఈ ఏడాదే....
మైసాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావురమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | దేవుడే ఇలా బ్రేక్ ఇచ్చాడు – గాయంపై రష్మిక మందన్న క్లారిటీ
ఆగస్టు 3, 2026

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026

Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ – ఆ ఒక్కటే మిగిలింది!
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
- ●CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం
- ●Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్
- ●Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●Uttam Kumar Reddy | సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●KTR | అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ.. ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్

Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్



