KTR | అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ.. ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు
KTR | తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య వైద్య చికిత్సకు సహకరించిన కేటీఆర్‌కు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
KTR | తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య వైద్య చికిత్సకు సహకరించిన కేటీఆర్‌కు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మైనర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి కోలుకున్న చిన్నారి భవిష్యతో పాటు కుటుంబ సభ్యులు మంగళవారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి భవిష్యతో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భవిష్య మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఎదగాలని, చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
వైద్య చికిత్సకు భరోసా
గత నెల మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా భవిష్య ఆరోగ్య సమస్య గురించి కేటీఆర్ తెలుసుకున్నారు. చిన్నారికి మైనర్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించిన విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం భవిష్యకు చికిత్స అందేలా అవసరమైన సహకారం అందించారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించిన కేటీఆర్‌కు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చికిత్స పూర్తయ్యేలా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు




