Rashmika Mandanna | దేవుడే ఇలా బ్రేక్ ఇచ్చాడు – గాయంపై రష్మిక మందన్న క్లారిటీ
ఇటీవల సినిమా షూటింగ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నగాయపడటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్మిక ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో టెన్షన్ పడుతూ పోస్ట్‌లో పెడుతోన్నారు. ఈ ప్రమాదంపై రష్మిక స్వయంగా క్లారిటీ ఇచ్చింది. దేవుడే తనకు ఈ స్మాల్ బ్రేక్ ఇచ్చాడంటూ ఫన్నీగా పోస్ట్ పెట్టింది.
Entertainment | Published On Aug 3, 2026, 7.56 pm IST
Rashmika Mandanna | ఓ సినిమా షూటింగ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నఇటీవల తీవ్రంగా గాయపడింది. డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తోండగా రష్మిక ప్రమాదం బారిన పడినట్లు ఆమె టీమ్ ప్రకటించారు. ఈ గాయం కారణంగా ఆరు వారాలు షూటింగ్‌లకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ గాయం ఏ సినిమా షూటింగ్‌లో జరిగిందన్నది మాత్రం వెల్లడించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో రష్మిక ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. భర్త విజయ్ దేవరకొండతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఈ ప్రమాదంపై రియాక్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ప్రమాదం తీవ్రంగానే జరిగి ఉండొచ్చని, అందుకే సైలెంట్‌గా ఉంటున్నారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
రూమర్లకు చెక్...
ఈ రూమర్లకు నేషనల్ క్రష్ చెక్ పెట్టింది. గాయంపై క్లారిటీ ఇచ్చింది. మైసా మూవీ షూటింగ్‌లోనే ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. గాయం రూపంలో దేవుడే తనకు రెస్ట్ ఇచ్చాడంటూ ఫన్నీగా సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
రోబోలా కాకుండా
"నా బాడీని ఓ రోబోలా కాకుండా మనిషిలా చూసుకోవాలని ఈ సంఘటనతో అర్థంమైంది. బిజీ షెడ్యూల్స్ కారణంగా విశ్రాంతి తీసుకునే అవకాశం దొరకడం లేదు. గత కొన్నేళ్లుగా గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్‌లు చేస్తూనే ఉన్నా. చివరకు దేవుడే బలవంతంగా నాకు ఈ చిన్న బ్రేక్ ఇచ్చాడు" అంటూ ఈ పోస్ట్‌లో రష్మిక పేర్కొన్నది. ఈ మధ్య కాలంలో తాను గాయాల బారిన పడటం ఇది మూడోసారి అని రష్మిక అన్నది. త్వరలోనే సెట్స్‌లో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేసింది.
నడవటం కుదరడం లేదు...
"తొడ భాగాన్ని, తుంటిని కలుపుతూ నాలుగు ముఖ్యమైన టెండన్లు ఉంటాయి. గాయం వల్ల అందులో ఒక టెండన్ పూర్తిగా తెగిపోయింది. నొప్పి కారణంగా కాలును పైకి లేపడం, వేగంగా నడవటం కుదరడం లేదు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోంది. వైద్యుల పర్యవేక్షణల్లో మెళ్లమెళ్లగా కోలుకుంటున్నాను" అని రష్మిక అన్నది.
టైమ్‌పాస్ కోసం ...
గాయం కారణంగా మంచానికే పరిమితం కావడంతో బోర్ కొడుతుందని, టైమ్‌పాస్ కోసం ఫజిల్స్ సాల్వ్ చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలు పెట్టింది. "ప్రతి రోజు గంటల తరడబడి వర్కవుట్స్, రన్నింగ్ చేసేదానిని. ఇప్పుడు జిమ్‌కు పూర్తిగా దూరమయ్యా.. స్వీట్లు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా తింటే ఎక్కడ బరువు పెరుగుతానో అనే భయంగా ఉంది. నోరును అదుపులో పెట్టుకుంటున్నాను" అంటూ తెలిపింది. రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hie guyssss!🥰❤️
Injuries suck.. 😩 and I was really hoping that no one will get to know.. but well 🐒🤷🏻♀️
Sorry I’ve been MIA 🐒 but hieeee! I’m hereeee!🙋🏻♀️😁
It happened awhile ago ya and this is my 3rd injury back to back.. 🤦🏻♀️
I should definitely learn to treat my body like a… pic.twitter.com/yJj70yEyAE— Rashmika Mandanna (@iamRashmika) August 3, 2026
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | షూటింగ్‌లో రష్మిక మందన్నకు గాయం – ఆరు వారాలు సినిమాలకు బ్రేక్
జులై 31, 2026

Rashmika Mandanna | నక్సలైట్‌గా నేషనల్ క్రష్ – ఊహించని జానర్లో రష్మిక తెలుగు మూవీ
జూన్ 18, 2026

Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న – ఫొటోలు వైరల్
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!
- ●ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!
- ●Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?
- ●Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి
- ●Rakesh Kumar | ఫీజు రీయింబర్స్మెంట్ ఏపీలో ఇస్తేనే తెలంగాణల ఇస్తరా?
- ●Bankipur Bypoll | మోదీ-షాలకు ఇక ఇంటిదారే

Rajinikanth Goud Photo Journalist | ఇంటర్నేషనల్ ఫోటో కంటెస్ట్‌లో సత్తా చాటిన తెలంగాణ.. నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు!

ఇంటి నంబర్ 13 తీసుకుంటే ప్రమాదమా? నిజం ఇదే!

Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?

Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి



