SIR | ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
SIR | ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
SIR | ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దశలోనూ పారదర్శకత పాటించాలని, డిజిటలైజేషన్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై కూడా సీఈఓ సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నట్లయితే, వారిని వీలైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కుటుంబ సభ్యులందరికీ ఓటు హక్కు వినియోగం సులభతరం అయ్యేలా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలు, అనామలీస్, మ్యాపింగ్ సమస్యలు, ఏఎస్‌డీ (ASD) అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫొటో మిస్‌మ్యాచ్ ఉన్న ఓటర్ల వివరాలను తప్పనిసరిగా పరిశీలించి సరిచేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగా పరిశీలించాలని తెలిపారు.
రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు పూర్తి వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఈఓ సూచించారు. ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్‌బాబు, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల విభాగం అధికారి రెహమాన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
- ●Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం
- ●Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
- ●DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..

Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు

Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం




