త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood Heroines | యాక్ష‌న్ రోల్స్‌కు సై – త‌గ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్లు

అందాల హీరోయిన్లు యాక్ష‌న్ బాట ప‌డుతున్నారు. ర‌ష్మిక మంద‌న్న‌, న‌య‌న‌తార‌, స‌మంత‌తో పాటు మ‌రికొంద‌రు అగ్ర క‌థానాయిక‌లు యాక్ష‌న్ సినిమాల విష‌యంలో హీరోల‌కు పోటీనిస్తూ త‌గ్గేదేలే అని అంటున్నారు.

N

Entertainment | Published On Dec 25, 2025, 5.56 pm IST

Tollywood Heroines | యాక్ష‌న్ రోల్స్‌కు సై – త‌గ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్లు

Tollywood Heroines

Advertisement

Tollywood Heroines | హీరోయిన్లు అంటే కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మ‌నే రూల్‌ను తిర‌గ‌రాస్తున్నారు నేటిత‌రం నాయిక‌లు. మూస ధోర‌ణి నుంచి బ‌య‌ట‌ప‌డుతూ క‌థ, పాత్ర‌ల ప‌రంగా ఎలాంటి రిస్క్‌లు అయినా తీసుకోవ‌డానికి రెడీ అంటున్నారు. యాక్ష‌న్ సినిమాలు హీరోలే చేయాల‌నే ట్రెండ్‌ను కూడా మార్చేస్తున్నారు. భారీ ఫైట్లు, ఛేజింగ్‌, వ‌య‌లెన్స్‌తో కూడిన క‌థ‌ల‌కు తాము కూడా న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని నిరూపిస్తున్నారు. ప్ర‌స్తుతం కొంద‌రు స్టార్ హీరోయిన్లు యాక్ష‌న్ సినిమాల‌తో ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఆ అందాల‌నాయిక‌లు ఎవ‌రంటే?

ర‌ష్మిక మంద‌న్న మైసా....

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన మైసా మూవీ ఇటీవ‌ల రిలీజైంది. ఈ సినిమాలో కెరీర్‌లోనే మోస్ట్ వ‌య‌లెంట్ క్యారెక్ట‌ర్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపిస్తోంది. ఇటీవ‌ల రిలీజైన గ్లింప్స్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకొని యాక్ష‌న్ మోడ్‌లో ర‌ష్మిక క‌నిపించింది. ఈ గ్లింప్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మైసా మూవీలో త‌మ తెగ‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాడే ఓ యోధురాలి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కెరీర్‌లోనే ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక న‌టిస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాకు ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైసాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ ఫైట్స్‌ను స‌మ‌కూర్చుతున్నారు.

స‌మంత మా ఇంటి బంగారం...

పెళ్లి త‌ర్వాత స‌మంత మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో స‌మంత ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో స‌మంత‌పై కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉంటాయ‌ట‌. వీటిలో డూప్ లేకుండా స‌మంత న‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స్వ‌యంగా స‌మంత మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తోంది. నందిని రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్‌...

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ద‌క్షిణాదిలో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది న‌య‌న‌తార‌. అవకాశాల విష‌యంలో యంగ్ హీరోయిన్లకు గ‌ట్టి పోటీ ఇస్తున్న న‌య‌న‌తార ప్ర‌స్తుతం ప‌ది వ‌ర‌కు సినిమాలు చేస్తోంది. వీటిలో రాకాయి ఒక‌టి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో న‌య‌న‌తార న‌టిస్తోంది. త‌న కూతుళ్ల‌ను కాపాడ‌టం కోసం ఓ త‌ల్లి సాగించిన పోరాటం నేప‌థ్యంలో రాకాయి మూవీ రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
అక్క వెబ్‌సిరీస్‌...
ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తోంది కీర్తి సురేష్‌. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ హిందీలో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్ నిర్మిస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్ లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement