Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు – నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక మందన్న తెగ కష్టపడుతోంది. ఈ దిగ్గజ గాయని పాత్రకు న్యాయం చేసేందుకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్వయంగా ప్రకటించింది. సుబ్బులక్ష్మి బయోపిక్‌కు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు.
Entertainment | Published On Nov 24, 2026, 4.00 pm IST
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంగీత పాఠాలు నేర్చుకుంటోంది. బయోపిక్ కోసం కష్టపడుతోంది. రష్మిక డెడికేషన్ సూపర్ అంటూ నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. దిగ్గజ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది.
సంగీతంలో శిక్షణ...
సుబ్బులక్ష్మి పాత్రకు న్యాయం చేసేందుకు రష్మిక మందన్న కర్ణాటక సంగీతంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుంది. ఈ విషయాన్ని మైసా ప్రమోషన్స్‌లో నేషనల్ క్రష్ స్వయంగా ప్రకటించింది.
సుబ్బులక్ష్మి బయోపిక్‌లో తొలుత ఆఫర్ వచ్చినప్పుడు ఎన్నో తరాలను తన సంగీతంతో మెప్పించిన అలాంటి దిగ్గజ గాయని పాత్రకు న్యాయం చేయగలనా లేదా అని భయపడినట్లు రష్మిక చెప్పింది. నటిగా నాకో ఛాలెంజింగ్‌గా భావించి ఈ బయోపిక్‌ను అంగీకరించానని అన్నది.
వాస్తవిక కోణంలో...
సుబ్బులక్ష్మి జీవితాన్ని వాస్తవిక కోణంలో ఈ బయోపిక్‌లో చూపించాలని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేస్తున్నారు. పాటలు పాడినట్లు హావభావాలు ప్రదర్శించడం, లిప్‌సింక్‌తో మ్యానేజ్ చేయడం ద్వారా ఈ దిగ్గజ గాయని పాత్రకు న్యాయం చేయలేమనిపించింది. శాస్త్రీయ సంగీతంపై కనీస అవగాహన ఉండాలని కథ విన్నప్పుడే అర్థమైంది. అందుకే కర్ణాటక సంగీతంతో పాటు పాటలు పాడటంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సుబ్బులక్ష్మి జీవితం గురించి పర్సనల్‌గా రీసెర్చ్ చేస్తున్నాను అని రష్మిక చెప్పింది. జీవితంలో తాను ఇప్పటివరకు ఎప్పుడూ పాటలు పాడలేదని, సరదాగా పాడమని స్నేహితులు అప్పుడప్పుడు అడిగినా కుదరదని చెప్పేదానిని అని రష్మిక తెలిపింది. బయోపిక్ కోసం శాస్త్రీయ సంగీతంలో ట్రైనింగ్ తీసుకుంటుండటం కొత్తగా అనిపిస్తుందని చెప్పింది.
అనిరుధ్ మ్యూజిక్....
సుబ్బులక్ష్మి బయోపిక్‌ను రాక్‌లైన్ వెంకటేష్, బన్నీవాస్‌లతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..
- ●BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ
- ●Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?
- ●Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ
- ●Bisleri | మినరల్ వాటర్‌లో ఉండే బ్రోమేట్ ఆరోగ్యానికి ఎలా హానికరం..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!

Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ

Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?






