త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్‌ సినిమాలో అదిరిపోయే రోల్!

Meenakshi Chaudhary | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ మూవీ తెరకెక్కుతున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నట్లుగా టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌గా కాకుండా కథలో కీలకంగా నిలిచే అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది.

P

Entertainment | Published On Aug 23, 2026, 4.10 pm IST

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్‌ సినిమాలో అదిరిపోయే రోల్!
Advertisement

Meenakshi Chaudhary | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ మూవీ తెరకెక్కుతున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నట్లుగా టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌గా కాకుండా కథలో కీలకంగా నిలిచే అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మెగాస్టార్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకున్నది. అయితే, మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ద్వితీయార్ధంలో కీలకంగా..

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మీనాక్షి పాత్ర ద్వితీయార్ధంలో కీలకంగా ఎంట్రీ ఇస్తుందట. ఆమె కనిపించే సన్నివేశాలు కథను మరో మలుపు తిప్పేలా ఉంటాయని టాక్. దీంతో అసలు ఆమె పాత్ర ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపు కనిపించే గెస్ట్ రోల్‌గానేనా? లేక కథలో కీలక భాగంగా లెన్తీ క్యారెక్టర్‌లో కనిపిస్తుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు ఈ సినిమాలో ప్రధాన కథానాయిక ఎవరన్నది కూడా ఇంకా సస్పెన్స్‌గానే కొనసాగుతున్నది. ఫీమేయిల్‌ లీడ్‌ రోల్‌లో ఎవరు కనిపించనున్నారనే దానిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వకపోవడంతో మీనాక్షి చౌదరి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడి చిత్రంలో కీలక పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మంచి అవకాశంగా మారుతుందని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తనదైన కమర్షియల్ టచ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. కథకు అవసరమైన విధంగానే ప్రతి పాత్రను తీర్చిదిద్దుతున్నారని, అందులో మీనాక్షి పాత్రకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని టాక్. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర కీలక నటీనటుల వివరాలను చిత్ర బృందం వెల్లడించే అవకాశం ఉన్నది.

అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావాలి..

చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ అంశాలతో పాటు బాబీ కొల్లి మార్క్ టేకింగ్‌తో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా సినిమా రిలీజ్‌ కానుండడంతో ప్రస్తుతం షూటింగ్ పనులను చిత్రబృందం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి ఎంట్రీపై వస్తున్న వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక మీనాక్షి సినిమాల విషయానికి వస్తే చివరగా నవీన్‌ పొలిశెట్టి నటించిన ‘అనగనగ ఒక రాజు’ మూవీలో నటించింది. ప్రస్తుతం కార్తీక్‌ దండు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వృషకర్మ మూవీలో అక్కినేని హీరో నాగచైతన్యతో జతకడుతోంది. నైట్ రైడర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని ఈ ఏడాది దసరా కానుగ లేదంటే.. డిసెంబర్‌లోనైనా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ప్రధానంగా విజువల్‌ ఎఫెక్ట్‌, గ్రాఫిక్స్‌కు ఎక్కువ సమయం పడుతోందని, అందుకే రిలీజ్‌ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement