త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాల‌య్య ఔట్ – ఎన్‌బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?

సంక్రాంతి రేసు నుంచి బాల‌కృష్ణ ఎన్‌బీకే 111 త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పండుగ‌కు ఇర‌వై రోజుల ముందే ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

N

Entertainment | Published On Aug 23, 2026, 4.46 pm IST

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాల‌య్య ఔట్ – ఎన్‌బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?
Advertisement

NBK 111 | వ‌చ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పోరు టాలీవుడ్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి, వెంక‌టేష్‌, ర‌వితేజ వంటి స్టార్ హీరోలు పండుగ బ‌రిలో నిల‌వ‌బోతున్నారు. 2027 సంక్రాంతికి చిరంజీవి కాకా, వెంక‌టేష్ జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌, ర‌వితేజ, శ్రీవిష్ణు మ‌ల్టీస్టార‌ర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌హాకాళితో పాటు మ‌రో మూడు సినిమాలు రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్‌బీకే 111

వీటితో పాటు బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఎన్‌బీకే 111 సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉందంటూప్ర‌చారం జ‌రిగింది. అయితే పండుగ స్లాట్స్ మొత్తం ఫుల్ కావ‌డంతో పండుగ‌ రేసు నుంచి ఎన్‌బీకే 111 త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతికి ఇర‌వై రోజుల ముందే ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

సెప్టెంబ‌ర్‌లో...

ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. డిసెంబ‌ర్ 24న బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు చెబుతోన్నారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. టైటిల్ కూడా అప్పుడే రివీల్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

గాయం కార‌ణంగా....

ఎన్‌బీకే 111లో ఓ యాక్ష‌న్ సీన్ చిత్రీక‌రిస్తుండ‌గా...ప్ర‌మాద‌వ‌శాత్తూ బాల‌కృష్ణ గాయ‌ప‌డ్డారు. ఆయ‌నకు స‌ర్జ‌రీ జ‌రిగింది. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న బాల‌కృష్ణ‌ సెప్టెంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి తిరిగి ఎన్‌బీకే 111 సెట్స్‌లో అడుగుపెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌...

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్‌బీకే 111 త‌ర్వాత కొర‌టాల శివ‌తో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే అమ‌రావ‌తిలో ఈ మూవీ లాంఛ్ అయ్యింది. షూటింగ్ మొద‌లుకాక‌ముందే బాల‌కృష్ణ‌కు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ మొద‌ల‌య్యాయ‌ని, ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌ను మూవీ టీమ్ ఖండించింది.

 

Advertisement
Advertisement