Rashmika Mandanna | పెళ్లి తర్వాత రష్మికకు తొలి అవార్డు – సాధించామంటూ పోస్ట్
పెళ్లి తర్వాత రష్మిక తొలి అవార్డును గెలుచుకుంది. శనివారం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్స్ అవార్డ్స్‌ను ప్రకటించింది. ఇందులో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకిగాను బెస్ట్ హీరోయిన్‌గా రష్మికకు పురస్కారం దక్కింది.
Entertainment | Published On Mar 7, 2026, 3.37 pm IST
Rashmika Mandanna | 2025 ఏడాదికిగాను గద్దర్ ఫిల్మ్స్ అవార్డ్స్ విజేతలను తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకిగాను ఉత్తమ నటిగా రష్మిక మందన్నకు అవార్డు వరించింది. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. పెళ్లి తర్వాత రష్మిక అందుకోనున్న ఫస్ట్ అవార్డు ఇది. బెస్ట్ హీరోయిన్‌గా ఎంపికకావడంపై రష్మిక ఆనందాన్ని వ్యక్తం చేసింది. "రాహులా మనం సాధించాం" అంటూ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. రష్మిక ట్వీట్‌పై రాహుల్ రవీంద్రన్ కూడా రియాక్ట్ అయ్యాడు.
అర్హురాలివి...
"గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా రష్మిక మందన్న అవార్డు దక్కడం ఆనందంగా ఉంది.ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మికకు నటనకు దక్కిన గౌరవం ఇది. నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఈ అవార్డుకు నువ్వు పూర్తిగా అర్హురాలివి. ఇలాంటివి మరెన్నో సాధించాలి" రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నాడు.
భూమాదేవి పాత్రలో...
నెటిజన్లతో పాటు అభిమానులు రష్మిక కంగ్రాట్స్ చెబుతోన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత ఏడాది నవంబర్‌లో రిలీజైంది. ఇందులో భూమాదేవి అనే పాత్రలో అసమాన నటనతో రష్మిక ఆకట్టుకుంది. తెలుగులో రష్మిక నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది కావడం గమనార్హం. ప్రేమ పేరుతో తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించే ప్రియుడికి ఓ యువతి ఎలా బుద్ది చెప్పిందనే పాయింట్‌తో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ రూపొందింది.
ఫుల్ బిజీ...
ప్రస్తుతం సినిమాల పరంగా రష్మిక ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి సినిమా చేస్తోంది. మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని అంగీకరించింది. హిందీ మూవీ కాక్ టెయిల్ 2 షూటింగ్‌ను ఇటీవలే రష్మిక పూర్తిచేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



