Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బోల్డ్ మూవీ కాక్ టెయిల్ ఈ ఏడాది హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Jul 25, 2026, 5.12 pm IST
Rashmika Mandanna | తెలుగుతో పాటు బాలీవుడ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. రెండు భాషల్లో నంబర్ వన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. యానిమల్, ఛావా బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఇటీవలే కాక్ టెయిల్ 2 మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటించింది.
హయ్యెస్ట్ కలెక్షన్స్...
హోమీ అద్జానియా దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాక్ టెయిల్ థియేటర్లలో 160 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ సిక్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కాక్ టెయిల్ 2 మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్ట్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతుంది. రష్మిక మందన్న, కృతి సనన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా దాదాపు అరవై కోట్లకు కాక్ టెయిల్ 2 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
బోల్డ్ రోల్....
కాక్ టెయిల్ కాన్సెప్ట్ ఔట్‌డేటెట్ అనే టాక్ వచ్చినా షాహిద్ కపూర్‌తో రష్మిక మందన్న, కృతి సనన్ కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఇందులో బోల్డ్ రోల్‌లో రష్మిక కనిపించింది. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందడం గమనార్హం. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక యాక్టివ్‌గా పాల్గొన్నది. కానీ విడుదల తర్వాత ఆమె పాత్రపై విమర్శలు రావడంతో ప్రమోషన్స్‌కు దూరమైంది. కృతి సనన్‌ను హైలైట్ చేయడానికి కావాలనే రష్మిక పాత్ర లెంగ్త్‌తో పాటు ఇంపార్టెన్స్ దక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందడం గమనార్హం.
కునాల్...దియా...
కునాల్, దియా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉంటారు. పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతారు. పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి విదేశాలకు వెకేషన్‌కు వెళతారు. వారి వెంట దియా ప్రాణ స్నేహితురాలు యాలీ కూడా వెళుతుంది. ఈ జర్నీలోనే కునాల్‌తో యాలీ ప్రేమలో పడుతుంది. దియాతో అతడి పెళ్లి ఫిక్సయ్యిందని తెలిసి కూడా అతడి వెంటపడుతుంది. పెళ్లికి ముందు కునాల్, యాలీ మధ్య బంధం గురించి దియాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? దియా, యాలీలలో కునాల్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం






