Rashmika Mandanna | తెలుగులో హారర్ మూవీకి రష్మిక మందన్న గ్రీన్ సిగ్నల్ – డైరెక్టర్ ఎవరంటే?
Rashmika Mandanna | రష్మిక మందన్న(Rashmika Mandanna) తెలుగులో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Dec 9, 2025, 4.53 pm IST
రష్మిక మందన్న
Rashmika mandanna | 2025 రష్మిక మందన్న(Rashmika Mandanna) కు బాగా కలిసివచ్చింది. తెలుగు(Tollywood), హిందీ భాషల్లో కలిసి ఈ ఏడాది ఐదు సినిమాలు చేసింది. అందులో నాలుగు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. బాలీవుడ్‌లో రష్మిక హీరోయిన్‌గా నటించిన ఛావా, థామా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తెలుగులో కుబేరతో తో పాటు ఇటీవల రిలీజైన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.
ఈ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మిక మందన్న టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ లేడీ ఓరియెంటెడ్ హారర్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనుదీప్ శైలి కామెడీ టచ్ ఉంటూనే ఈ సినిమా చివరి వరకు భయపెడుతుందట. ఇటీవలే రష్మికను కలిసిన అనుదీప్ కథను వినిపించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా రష్మిక ఇంకా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట.
థామా తర్వాత రష్మిక నటిస్తున్న సెకండ్ హారర్ మూవీ ఇది. తెలుగులో మాత్రం రష్మిక హారర్ సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. త్వరలోనే రష్మిక మందన్న, కేవీ అనుదీప్ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చునని అంటున్నారు.
ప్రస్తుతం రష్మిక మందన్న మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మైసా పేరుతో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తుంది. గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వారియర్ ప్రిన్స్ తరహా పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతున్నది. కాబోయే భర్త విజయ్ దేవరకొండతో ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న కాక్ టెయిల్ 2 షూటింగ్ చివరి దశలో ఉంది.
మరోవైపు విజయ్ దేవరకొండతో వచ్చే ఏడాది రష్మిక ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అక్టోబర్‌లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో విజయ్, రష్మిక పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



