Rashmika Mandanna | తెలంగాణ పోలీస్ అకాడెమీలో రష్మిక మందన్న – గన్ ఫైరింగ్‌లో శిక్షణ
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన మైసా మూవీ నవంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ యాక్షన్ సినిమా కోసం రష్మిక పడిన కష్టంపై మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడెమీలో గన్ ఫైరింగ్‌లో నేషనల్ క్రష్ శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు.
Entertainment | Published On Nov 19, 2026, 4.53 pm IST
Rashmika Mandanna | మైసా సినిమా కోసం రష్మిక మందన్న పడిన కష్టంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అంటూ నేషనల్ క్రష్‌ను కొనియాడుతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన మైసా నవంబర్ 27న రిలీజ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్‌లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్రధాన పాత్రలో రష్మిక నటిస్తోన్న తొలి సినిమా ఇది. నేషనల్ క్రష్ అనే ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఇందులో కనిపించబోతుంది.
బికమింగ్ మైసా....
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో రష్మిక చేసిన రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. మైసా కోసం కూర్గ్ బ్యూటీ పడిన కష్టాన్ని వివరిస్తూ బికమింగ్ మైసా పేరుతో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం రష్మిక తెలంగాణ పోలీస్ అకాడెమీలో గన్ ఫైరింగ్‌లో శిక్షణ కూడా తీసుకుందని దర్శకుడు రవీంద్ర పుల్లే పేర్కొన్నారు. క్యారెక్టర్‌లో సహజత్వం కోసం గన్ ఎటా పట్టుకోవాలి, ఏ విధంగా కాల్చాలి అనే విషయంలో రష్మికకు పోలీస్ అకామెడీలో ట్రైనింగ్ ఇప్పించినట్లు చెప్పారు. తక్కువ టైమ్‌లోనే గన్ హ్యాండిల్ చేయడంపై ఆమె పట్టుసాధించిదని అన్నారు.
రోజు పది గంటలు ట్రైనింగ్...
ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్ వెళ్లిన రష్మిక మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందని దర్శకుడు తెలిపారు. రోజుకు ఎనిమిది నుంచి పది గంటల వరకు ఈ శిక్షణ సాగింది. కుంగ్‌ఫూ, ముయే థాయ్, ఐకిడో, తైక్వాండో వంటి కఠిన మైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. 90 అడుగుల ఎత్తు నుంచిహీరోయిన్ నీళ్లలోకి దూకే సీన్‌ను తొలుత డూప్‌తో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ రష్మిక అందుకు ఒప్పుకోలేదు. ఫస్ట్ టేక్‌లోనే ఆ సీన్ ఒకే అయ్యింది. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్, అడవుల్లో షూటింగ్ చేసే క్రమంలో చాలా సార్లు రష్మికకు గాయాలు అయ్యాయి. అయినా ఈ రోజు వెనకడుగు వేయలేదు. సినిమాలో స్క్రీన్‌పై మైసానే కనిపిస్తుంది. రష్మిక ఎక్కడ కనిపించదు. అంతలా పాత్రలో ఒదిగిపోయింది అంటూ దర్శకుడు చెప్పారు.
గోండు యువతిగా....
మైసా సినిమాలో గోండు యువతిగా రష్మిక మందన్న కనిపించబోతుంది. రావురమేష్, సముద్రఖని, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 27 తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే






