త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు – తండ్రి ప్రేమ‌ను గుర్తుచేసుకున్న ర‌ష్మిక

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీ మైసా న‌వంబ‌ర్ 27న రిలీజ్ కాబోతుంది. మైసా నుంచి ఏనాటి వ‌ర‌మో నువ్వు అనే పాట సోమ‌వారం రిలీజైంది. తండ్రీకూతుళ్ల బంధం గొప్ప‌త‌నాన్ని ఆవిష్క‌రిస్తూ సాగిన ఈ పాటకు రెహ‌మాన్ సాహిత్యం అందించారు. కృష్ణ తేజ‌స్వి ఆల‌పించారు.

N

Entertainment | Published On Nov 16, 2026, 8.45 pm IST

Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు – తండ్రి ప్రేమ‌ను గుర్తుచేసుకున్న ర‌ష్మిక
Advertisement

Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ పాన్ ఇండియా సినిమా ‘మైసా. లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 27న ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఇందులో యాక్ష‌న్ అవ‌తార్‌లో ర‌ష్మిక క‌నిపించ‌బోతుంది. మైసా మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ‘ఏనాటి వరమో నువ్వు’ అంటూ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్క‌రిస్తూ సాగిన ఈ పాట‌కు రెహ‌మాన్ సాహిత్యం అందించారు. కృష్ణ‌తేజ‌స్వి ఆల‌పించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ స‌మ‌కూర్చారు.

తండ్రి ప్రేమ‌కు గుర్తుగా...

ప్ర‌తి తండ్రికి కూతురిపై ఉండే నిస్వార్థమైన ప్రేమను, ఆప్యాయత ఈ పాటలోని లిరిక్స్ చాటిచెబుతోన్నాయి . ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్‌లో మైసా చిన్నప్పటి రోజులను చూపించారు. తండ్రిపై తనకున్న ప్రేమకు గుర్తుగా మైసా ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్న‌ట్లుగా చూపించారు. ఆ ప‌చ్చ‌బొట్ట ద్వారానే తండ్రి జ్ఞాప‌కాల‌ను ర‌ష్మిక‌ గుర్తుచేసుకునే సీన్‌తోనే ఈ పాట మొద‌లైంది. ఏనాటి వరమో నువ్వు పాట‌లో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు స‌ముద్ర‌ఖ‌ని, ఈశ్వ‌రీరావు క‌నిపించారు.

ఐదు భాష‌ల్లో...

‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఇటీవ‌లే జ‌పాన్‌కు వెకేష‌న్ వెళ్లింది ర‌ష్మిక‌. ఈ వెకేష‌న్‌ను ముగించుకొని త్వ‌ర‌లో మైసా ప్ర‌మోష‌న్స్‌లో భాగం కాబోతుంది.

Advertisement
Advertisement