Rashmika Mandanna | పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ – బాలీవుడ్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు….
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ఓ బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక మందన్న. కాక్‌టెయిల్2 రిలీజ్‌డేట్‌ను మేకర్స్ శుక్రవారం అనౌన్స్‌చేశారు. షాహిద్‌కపూర్, రష్మిక మందన్న, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడు విడుదల కానుందంటే?
Entertainment | Published On Mar 13, 2026, 4.40 pm IST
ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఏడడుగుల వేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విరోష్ పెళ్లి గ్రాండ్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటుచేశారు.పెళ్లి తర్వాత ఫారిన్ వెకేషన్ వెళ్లిన ఈ జోడీ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. నెక్స్ట్ వీక్ నుంచి తిరిగి సినిమా షూటింగ్‌లను మొదలుపెట్టబోతున్నారు.
ధురంధర్ 2 థియేటర్లలో...
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో రణబాలి, మైసా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో కాక్‌టెయిల్ 2లో నటిస్తోంది. కాక్‌టెయిల్ 2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం రివీల్ చేశారు. జూన్ 19న ఈ మూవీ థియేటర్లలో కి రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. ధురంధర్ 2 మూవీ థియేటర్లలో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను స్క్రీనింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాక్‌టెయిల్ 2లో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.
ప్రీ లుక్ పోస్టర్...
శుక్రవారం ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వేర్వేరుగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లు చూస్తుంటే షాహిద్, రష్మికతో పాటు కృతిసనన్ ఒకే కారులో కలిసి జర్నీ చేస్తోన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్స్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేకర్స్ మాత్రం ఈ రూమర్‌పై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ఫస్ట్ టైమ్...
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాక్‌టెయిల్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక మందన్న. అంతే కాకుండా ఈ ఏడాది రష్మిక నుంచి రిలీజ్ కానున్న తొలి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. దాంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. కాక్‌టెయిల్ మూవీ సీక్వెల్‌గా కాక్‌టెయిల్ 2 తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్‌కు హోమీ అద్జానియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు – భర్త విజయ్‌తో కలిసి సింపుల్ సెలబ్రేట్ చేసుకున్న రష్మిక
ఏప్రిల్ 6, 2026

Vijay Rashmika | ఐ లవ్ యూ జయమ్మ – రష్మికకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ
ఏప్రిల్ 5, 2026

Rashmika Mandanna | గుడ్‌న్యూస్ చెప్పిన రష్మిక – మేము ముగ్గురమయ్యాం అంటూ పోస్ట్
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



