Rashmika Mandanna | అప్పుడు జాన్వీ – ఇప్పుడు రష్మిక – సేమ్ సీన్ రిపీట్
పెద్ది మూవీలో జాన్వీ రోల్ వివాదం టాలీవుడ్‌ను కుదిపేసింది. తాజాగా జాన్వీ కపూర్ లాంటి అనుభవమే బాలీవుడ్‌లో రష్మికకు ఎదురైందట. కాక్ టెయిల్ 2లో తన పాత్రను స్క్రీన్‌పై చూపించిన తీరు విషయంలో రష్మిక అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 22, 2026, 5.38 pm IST
Rashmika Mandanna | పెద్ది మూవీ వివాదం కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌ను కుదిపేసింది. జాన్వీ కపూర్ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు సానా ఆవిష్కరించిన తీరుపై దారుణంగా విమర్శలొచ్చాయి. దర్శకుడి తీరును చాలా మంది స్టార్స్ తప్పుపట్టారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గానే చూపిస్తున్నారని, అవసరానికి వాడుకొని ఆ తర్వాత పక్కనపడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్, కరీనా కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు.
ప్రమోషన్స్‌కు దూరం...
ఈ విమర్శలు, వివాదం కారణంగా రిలీజ్ తర్వాత పెద్ది ప్రమోషన్స్‌కు జాన్వీ దూరమైంది. ఈ సినిమా గురించి ఎలాంటి పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్టలేదు. ఈవెంట్స్‌కు అటెండ్ కాలేదు. కంప్లీట్ సైలెంట్‌గా మారింది. తన రోల్‌ఫై వచ్చే విమర్శలు ఖండించలేదు. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పిన కూడా పట్టించుకోలేదు. అచ్చియమ్మ రోల్‌ను రాసిన తీరు విషయంలో జాన్వీ హర్ట్ అయినట్లు ప్రచారం జరిగింది.
కాక్ టెయిల్ 2
పెద్ది వివాదం ముగియకముందే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సారి హీరోయిన్ మారింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. రష్మిక హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ 2 మూవీ ఇటీవలే రిలీజైంది. మూడు రోజుల్లోనే 76 కోట్ల కలెక్షన్స్‌తో ఈ రొమాంటిక్ మూవీ అదరగొడుతోంది. కానీ రష్మిక రోల్‌పై మాత్రం దారుణంగా విమర్శలొస్తున్నాయి. ఆమె హిందీ డబ్బింగ్ సరిగా లేదని, యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అస్సలు బాగాలేవని అంటున్నారు.
సైడ్ క్యారెక్టర్‌లా...
కాక్ టెయిల్ 2లో రష్మికను హీరోయిన్‌లా కాకుండా సైడ్ క్యారెక్టర్‌లా ఈ సినిమాలో చూపించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు రష్మికకు చెప్పిన కథ వేరట. పాయింట్ నచ్చే ఈ బాలీవుడ్ మూవీని నేషనల్ క్రష్ అంగీకరించిందట. కానీ ఫైనల్ ఔట్‌పుట్‌కు వచ్చేసరికి రష్మిక రోల్ లెంగ్త్ తగ్గించారట. మరో హీరోయిన్ కృతి సనన్‌ను హైలైట్ చేయడానికే రష్మిక క్యారెక్టర్ ఇంపార్టెన్స్‌ను తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ తీరుతో రష్మిక చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాక్ టెయిల్ 2 రిలీజ్‌కు ముందు ప లు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నది. సోషల్ మీడియాలో సినిమాను గట్టిగా ప్రమోట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత కాక్ టెయిల్ 2ను ఉద్దేశించి ఎలాంటి పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్టలేదు. భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న పట్టించుకోవడం లేదు. ఈవెంట్స్‌కు దూరంగా ఉంటోంది. ఈ సినిమా విషయంలో కృతి సనన్, రష్మిక మందన్న మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించి నెటిజన్లు చేస్తోన్నట్లు ట్వీట్లు, పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiara Advani | టాక్సిక్ వర్సెస్ వాన్ – భర్తతో కియారా అద్వానీ బాక్సాఫీస్ వార్
జూన్ 22, 2026

Rashmika Mandanna | రెండు రోజుల్లోనే 53 కోట్లు – నెగెటివ్ టాక్‌తో కుమ్మేస్తోన్న రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
జూన్ 21, 2026

Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వర్సెస్ కాక్ టెయిల్ 2 – కలెక్షన్స్‌లో సమంతను బీట్ చేసిన రష్మిక బాలీవుడ్ మూవీ
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
- ●Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం

MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది

Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...




