త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక‌ను చుట్టుముట్టిన అభిమానులు – ర‌క్ష‌ణ‌గా నిలిచిన కృతి స‌న‌న్ – వీడియో వైర‌ల్‌

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. కాక్‌టెయిల్ 2 ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా పూణేలో జ‌రిగిన ఓ ఈవెంట్‌కు అటెండ్ అయిన కూర్గ్ బ్యూటీని అభిమానులు ఒక్క‌సారిగా చుట్టుముట్టారు. తోపులాట జ‌ర‌గ‌డంతో ర‌ష్మిక భ‌యంతో వ‌ణికిపోయింది. అభిమానుల బారి నుంచి ర‌ష్మిక‌ను కృతి స‌న‌న్ కాపాడింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Jun 14, 2026, 12.10 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక‌ను చుట్టుముట్టిన అభిమానులు – ర‌క్ష‌ణ‌గా నిలిచిన కృతి స‌న‌న్ – వీడియో వైర‌ల్‌
Advertisement

Rashmika Mandanna | నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 ప్ర‌మోష‌న్స్‌లో అభిమానులు ఒక్క‌సారిగా చుట్టుముట్ట‌డంతో ర‌ష్మిక భ‌యంతో వ‌ణికిపోయింది. కూర్గ్ బ్యూటీకి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా బాలీవుడ్ హీరోయిన్ కృతి స‌న‌న్ ఆమెకు ర‌క్ష‌ణ‌క‌వ‌చంలా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ....

షాహిద్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 మూవీ జూన్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు హోమీ అద్జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూన్‌లో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ సినిమాల్లో కాక్‌టెయిల్ 2పైనే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

పూణేలో...

కాగా కాట్‌టెయిల్ 2 మ్యూజిక‌ల్ ఫెస్ట్ పేరుతో మేక‌ర్స్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌నునిర్వ‌హిస్తున్నారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌నివారం పూణేలోని ఓ మాల్‌లో భారీ ఈవెంట్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్‌కు షాహిద్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కృతి స‌న‌న్ అటెండ్ అయ్యారు. ఈవెంట్‌లో వారిని చూడ‌గానే అభిమానులు ఒక్క‌సారి బారికేడ్ల‌ను తోసుకుంటూ ముందుకు వ‌చ్చారు. ర‌ష్మిక, కృతి స‌న‌న్‌తో పాటు షాహిద్ క‌పూర్‌ను చుట్టుముట్టారు. షాహిద్ క‌పూర్ ష‌ర్ట్ ప‌ట్టుకొని లాగారు. హీరోయిన్ల‌ను తాకేందుకు ప్ర‌య‌త్నించారు. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్య‌లో అభిమానులు రావ‌డంతో తోపులాట జ‌రిగింది. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో పోలీసుల సూచ‌న మేర‌కు ఈవెంట్‌ను మేక‌ర్స్ క్యాన్సిల్ చేశారు.

కాపాడిన కృతి స‌న‌న్‌...

మాల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కూడా ముగ్గురికి క‌ష్ట‌మైపోయింది. ఫ్యాన్స్ తోపులాట‌తో ర‌ష్మిక భ‌యంతో వ‌ణికిపోయింది. దాంతో ఆమెకు ర‌క్ష‌ణ వ‌ల‌యంలా కృతి స‌న‌న్ నిలిచింది. ర‌ష్మిక‌ను ఎవ‌రు ట‌చ్ చేయ‌కుండా రెండు వైపులు చేతులు పెట్టి ఆమెను క్షేమంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అభిమానుల బారి నుంచి ర‌ష్మిక‌ను కృతి స‌న‌న్ కాపాడింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కృతి గొప్ప మ‌న‌సుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సెలిబ్రిటీల ఆగ్ర‌హం...

ఫ్యాన్స్‌ తీరు ప‌లువురు సెలిబ్రిటీల‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అభిమానం పేరుతో ఇలా హ‌ద్దులు దాట‌డం క‌రెక్ట్ కాద‌ని, సెలిబ్రిటీల‌ను ఇబ్బంది పెట్టొద్దంటూ కామెంట్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను అన‌సూయ కూడా షేర్ చేసింది.

;

Advertisement
Advertisement