త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Deverakonda | ర‌ష్మిక దేవ‌ర‌కొండ – భ‌ర్త ఇంటి పేరుతో నేష‌న‌ల్ క్ర‌ష్ పోస్ట్ వైర‌ల్ – విజ‌య్ క్యూట్ రిప్లై

పెళ్లైన ఆరు నెల‌ల త‌ర్వాత అత్తింటి పేరును త‌న పేరు ప‌క్క‌న జోడిస్తూ ఫస్ట్ టైమ్ ర‌ష్మిక మంద‌న్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ర‌ష్మిక దేవ‌ర‌కొండ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ర‌ష్మిక పోస్ట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ రిప్లై ఇచ్చాడు.

N

Entertainment | Published On Aug 20, 2026, 6.52 pm IST

Rashmika Deverakonda | ర‌ష్మిక దేవ‌ర‌కొండ – భ‌ర్త ఇంటి పేరుతో నేష‌న‌ల్ క్ర‌ష్ పోస్ట్ వైర‌ల్ – విజ‌య్ క్యూట్ రిప్లై
Advertisement

Rashmika Deverakonda |  పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ అత్తింటి పేరును త‌న పేరు ప‌క్క‌న జోడిస్తూ ర‌ష్మిక పెట్టిన‌ ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక మంద‌న్న ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఏడ‌డుగుల వేసింది. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఈ జంట పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న త‌న పేరును మార్చుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అత్తింటి పేరును యాడ్ చేస్తూ ర‌ష్మిక దేవ‌ర‌కొండ‌గా సోష‌ల్ మీడియాలో కొన‌సాగ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ర‌ష్మిక మంద‌న్న‌గానే కంటిన్యూ అవుతోంది.

ఫ‌స్ట్ టైమ్ అత్తింటి పేరుతో....

పెళ్లైన ఆరు నెల‌ల త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ అత్తింటి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది ర‌ష్మిక మంద‌న్న‌. మైసా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ర‌ష్మిక ప్ర‌స్తుతం షూటింగ్‌ల‌కు దూర‌మైంది. విశ్రాంతి తీసుకుంటోంది. ఈ గ్యాప్‌లో పెళ్లికి ముందు ఫ్యామిలీతో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌డిపిన క్ష‌ణాలు, విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన పాత ఫొటోల‌న్నింటిపై ర‌ష్మిక కామెంట్స్ చేస్తూ వ‌చ్చింది. అందులో చాలా ఫాటోలు తీసిన క్రెడిట్ నాదే అంటూ గురువారం కామెంట్లు పెట్టింది.

ఇట‌లీ టూర్‌లో....

ఈ ఏడాది ఆరంభంలో ఇట‌లీ టూర్‌లో ఉన్న టైమ్‌లో విజ‌య్ బ‌ర్గ‌ర్ తింటున్న ఓ ఫొటోకు "పిక్చ‌ర్ క్రెడిట్‌బై ర‌ష్మిక దేవ‌ర‌కొండ" అంటూ నేష‌న‌ల్ క్ర‌ష్ రిప్లై ఇచ్చింది. ఫ‌స్ట్ టైమ్ అత్తింటి పేరును త‌న పేరు ప‌క్క‌న జోడించ‌డంతో నెటిజ‌న్లు ఆమె పోస్ట్‌ను తెగ షేర్ చేస్తున్నారు. విజ‌య్ త‌న త‌ల్లిదండ్రుల‌తో దిగిన ఫొటోలు, ఫారిన్ టూర్ల‌లో ఉన్న ఫొటోల‌ను కూడా తానే తీసిన‌ట్లు ర‌ష్మిక కామెంట్లు పెట్టింది. ఇందులో ఐదారేళ్ల క్రితం దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. అప్ప‌టి నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగిన‌ట్లు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ రిప్లై...

ర‌ష్మిక కామెంట్ల‌పై త‌న‌దైన శైలిలో విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌దులిచ్చాడు. "నువ్వు తీసిన నా ఫొటోలు అన్నింటిపైనా కామెంట్ చేయ‌డానికి నీకు అనుమ‌తి ఇస్తున్నా" అని అని ర‌ష్మిక‌ను ఉద్దేశించి విజ‌య్ కామెంట్ పెట్టాడు. వీరిద్ద‌రి ఇన్‌స్టాగ్రామ్ చాట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ర‌ణ‌బాలి సినిమా చేస్తోన్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. మైసా షూటింగ్‌లో ర‌ష్మిక గాయ‌ప‌డ‌టంతో ర‌ణ‌బాలి రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ వెల్ల‌డించ‌లేదు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Advertisement
Advertisement