Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
Yash | కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పిల్లలు చూడొచ్చా? అనే ప్రశ్నకు యశ్ స్పష్టతనిచ్చారు. ఈ చిత్రం పెద్దల కోసం రూపొందించిందని.. పిల్లలు సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు.
Entertainment | Published On Aug 19, 2026, 10.05 pm IST
Yash | కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పిల్లలు చూడొచ్చా? అనే ప్రశ్నకు యశ్ స్పష్టతనిచ్చారు. ఈ చిత్రం పెద్దల కోసం రూపొందించిందని.. పిల్లలు సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు. రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యశ్ మాట్లాడుతూ.. ‘పిల్లలు ఈ సినిమా చూడకూడదు. వారు ఇంట్లోనే ఉండాలి. ఈ చిత్రం పిల్లల కోసం తీసింది కాదు. పెద్దలకు ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉంటుంది. ఏం చూడాలి, సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి, జీవితంలో ఏం చేయకూడదో వాళ్లే నిర్ణయించుకోగలరు. ఈ సినిమా చాలా వాస్తవికంగా ఉంటుంది. కథలో చాలా లోతు ఉంది’ అని అన్నారు. అలాగే, ట్రైలర్‌లో చూపించినదంతా సినిమాలో ఉండదని యశ్ తెలిపారు. ఇప్పటికే ట్రైలర్‌లోని కొన్ని తీవ్ర సన్నివేశాలపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. సినిమాలోని కథ చాలా సహజంగా, ఆసక్తికరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
‘టాక్సిక్’ ట్రైలర్‌ను పరిశీలిస్తే.. తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణ చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. తండ్రికి కొడుకు క్షమాపణ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అదే కొడుకు తండ్రికి ఎదురుతిరిగినట్లు కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? వారి మధ్య విభేదాలకు కారణమేంటి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. యశ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యశ్ మార్క్ యాక్షన్‌తో పాటు వైవిధ్యమైన కథాంశాన్ని ఈ సినిమాలో ప్రేక్షకులు చూడనున్నారు. ఇప్పటికే ట్రైలర్ నుంచి విడుదలైన కొన్ని సన్నివేశాలు విజువల్ స్టైల్, యాక్షన్ డిజైన్, సినిమాటిక్ స్కేల్ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. డార్క్ విజువల్ వరల్డ్ సినిమాకు డిఫరెంట్ గుర్తింపును తీసుకొస్తుందనే అంచనాలున్నాయి.
ఈ ఇక మూవీ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ మూవీ టికెట్ల ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం మేరకు.. ఏపీ, తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే షోలకు టికెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు ధరలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ షోలకు ఐదురోజుల పాటు అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు టికెట్ ధర పెంచేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల టికెట్ల ధరలు పెంచిన సినిమాలకు ఆదరణ దక్కడం లేదు. కన్నడ స్టార్ హీరో నటించిన సినిమాకు టికెట్ల ధరలను పెంచితే వర్కౌట్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ సిరీస్‌తో యశ్‌కు భారీగా అభిమానులయ్యారు. మరి టాక్సిక్ మూవీకి వారిని ఆకట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
- ●Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ
- ●Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?
- ●Vijay | వర్షంతో షూటింగ్ క్యాన్సిల్.. తల్లిదండ్రుల చెంత సేదతీరిన విజయ్ దేవరకొండ

Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?




