Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
వ్యాపారిని కిడ్నాప్ చేసి, 10 కోట్లు డిమాండ్ చేసిన మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
- మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్, మరో ఐదుగురిపై అటెంప్ట్ మర్డర్ కేసు
- రూ.10 కోట్లు ఇవ్వాలని వ్యాపారి గొంగడి హరికృష్ణను డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఫిర్యాదు
- మొదట మేడిపల్లి పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్, అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు కేసు బదిలీ
Konda Surekha former OSD | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యాపారిని బెదిరించి ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ఘటనలో సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. గొంగడి హరికృష్ణ అనే వ్యాపారిని సుమంత్ తన డెన్‌కు పిలిపించుకున్నట్లు సమాచారం. అక్కడ హరికృష్ణను ఏకంగా రూ.10 కోట్లు ఇవ్వాలని సుమంత్ డిమాండ్ చేశాడు. అయితే, అంత భారీ మొత్తం ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన సుమంత్, అతని అనుచరులు ఇనుప రాడ్లతో వ్యాపారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు.
తీవ్ర గాయాలపాలైన బాధితుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు. క్రైమ్ జరిగిన లొకేషన్ ఆధారంగా అనంతరం ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు సుమంత్‌పై సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసును ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న మంత్రి మాజీ ఓఎస్డీ.. ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు
- ●Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు
- ●Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను
- ●MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?
- ●Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం

Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు

Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను





