Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?
Tamannaah Bhatia | గతంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా భాటియా.. ఇప్పుడు కథానాయికగా సినిమాలు తగ్గించుకుని విభిన్నమైన పాత్రల వైపు అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లు, ప్రత్యేక సాంగ్స్‌తో తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ క్రమంలోనే తెరపై ఇంటిమేట్ సీన్స్ విషయంలో ఇన్నాళ్లూ పాటించిన రూల్స్‌ను సైతం పక్కన పెట్టేసింది. క
Entertainment | Published On Aug 19, 2026, 8.30 pm IST
Tamannaah Bhatia | గతంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా భాటియా.. ఇప్పుడు కథానాయికగా సినిమాలు తగ్గించుకుని విభిన్నమైన పాత్రల వైపు అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లు, ప్రత్యేక సాంగ్స్‌తో తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ క్రమంలోనే తెరపై ఇంటిమేట్ సీన్స్ విషయంలో ఇన్నాళ్లూ పాటించిన రూల్స్‌ను సైతం పక్కన పెట్టేసింది. కథకు అవసరమైతే ముద్దు సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని తాజాగా స్పష్టం చేసింది. సినీ కెరీర్ ప్రారంభం నుంచి ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉన్న తమన్నా.. 2023లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 2’తో తొలిసారి రూల్‌ని బ్రేక్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా ఎదిగే క్రమంలో భయం, సంకోచం అడ్డంకులుగా మారకూడదని అన్నారు. కథలో కీలకంగా ఉండే ఇంటిమేట్ సీన్స్‌ను విడిగా చూసి తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడింది. సినిమా కథకు ఆ సన్నివేశం అవసరమైతే.. దాన్ని పాత్రలో భాగంగానే చూడాలని పేర్కొంది. కాలంతో పాటు సినిమా తీరు, ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారుతున్నాయని తమన్నా చెప్పింది. కథ డిమాండ్ చేసినప్పుడు నటీనటులు కూడా ఇలాంటి సన్నివేశాలను మరింత పరిణతితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. తన ఎదుగుదలకు భయం, సంకోచం అడ్డుగా నిలవకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు పాత్రలను చూసే విధానంలో మార్పు తీసుకొచ్చినట్లు మిల్కీ బ్యూటీ కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.
తెలుగులో తగ్గిన జోరు..
ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగిన తమన్నా.. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించారు. శ్రీ, హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, రచ్చ, తడాఖా, ఆగడు, ఎఫ్ 2, సైరా నరసింహారెడ్డి, ఎఫ్ 3 తదితర చిత్రాల్లో మెప్పించారు. ముఖ్యంగా హ్యాపీ డేస్, 100% లవ్, ‘రచ్చ’, ఎఫ్ 2, ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే, ఇటీవలి కాలంలో తెలుగులో తమన్నా కనిపించే సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కథానాయికగా వరుస చిత్రాలు చేయడం కంటే.. తనకు సరిపోయే పాత్రలు, ప్రత్యేకమైన అవకాశాలపైనే ఆమె దృష్టి పెడుతున్నది. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓదెల 2’లో ఆమె కీలక పాత్రలో కనిపించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
బాలీవుడ్‌లో ప్రయత్నాలు..
మరోవైపు హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రం తమన్నా వరుసగా విభిన్నమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ 2తో పాటు బబ్లీ బౌన్సర్, జీ కర్దా వంటి ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. వెబ్‌సిరీస్‌లతో పాటు స్పెషల్ రోల్స్‌తో పాటు సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే, కేవలం గ్లామర్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం చేయడం తమన్నాకు అంతగా నచ్చడం లేదట. తనలోని నటిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించుకునే అవకాశమున్న పాత్రలు రావాలని కోరుకుంటోంది. దర్శక, నిర్మాతలు తన ఇమేజ్‌ను దాటి.. నటనకు ఆస్కారమున్న పాత్రలను కూడా ఆఫర్ చేయాలని తమన్నా అభిప్రాయపడుతోంది.
ఇక పాత్రల ఎంపికలో కొత్త దారి..
ప్రస్తుతం తమన్నా కెరీర్ విషయంలో వేగం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆమె.. ఇప్పుడు కథ, పాత్ర, తనకు అందులో ఉన్న అవకాశం వంటి అంశాలను పరిశీలించి ప్రాజెక్టులను ఎంచుకుంటున్నది. స్పెషల్ సాంగ్స్, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటిగా కొత్త కోణాలను చూపించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నది. తెలుగులో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో బాలీవుడ్‌లో తన మార్కెట్‌ను మరింత విస్తరించడంతో పాటు.. నటిగా భిన్నమైన పాత్రలు చేయాలనే ఆలోచనలో తమన్నా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె ఎలాంటి కథలను ఎంచుకుంటారు? టాలీవుడ్‌లో మళ్లీ కథానాయికగా బిజీ అవుతారా? లేక బాలీవుడ్ ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?
- ●Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
- ●Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి




