iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లు..
iQOO Z11 | ఐక్యూ సంస్థ తన జడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ జడ్11ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే గురువారం నాడు ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాస్టర్, స్మార్టర్ విత్ ఏఐ అనే ట్యాగ్‌లైన్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు.
Technology | Published On Aug 20, 2026, 6.42 pm IST
iQOO Z11 | ఐక్యూ సంస్థ తన జడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ జడ్11ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే గురువారం నాడు ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాస్టర్, స్మార్టర్ విత్ ఏఐ అనే ట్యాగ్‌లైన్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఉత్పాదకత, విద్యా కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఇందులో ప్రత్యేక కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను అందించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్ ను అందించగా, ఈ చిప్‌సెట్ కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ భారత్‌లో ఇదే కావడం విశేషం. మీడియాటెక్ 8వ తరం ఎన్‌పీయూను ఇందులో అందించారు. పరికరంలోనే కృత్రిమ మేధ ఆధారిత పనులను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్‌గా ఇది పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
ఎక్కువ సమయం పాటు అధిక పనిభారంతో ఫోన్‌ను ఉపయోగించినప్పటికీ పనితీరు స్థిరంగా ఉండేలా 3800 చదరపు మిల్లీమీటర్ల అంతర్గత వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను అందించారు. ఇందులో 7050 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్లూవోల్ట్ బ్యాటరీని ఇచ్చారు. దీన్ని ఎక్కువ కాలం బ్యాటరీ బ్యాకప్‌ను అందించేలా రూపొందించారు. ఇందులో 1.5కె రిజల్యూషన్ కలిగిన 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2000 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్‌లో ప్రకాశాన్ని అందిస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కూడా ఈ ఫోన్‌కు అందించారు. దీంతో నీటిలో నిరంతరంగా మునిగిపోయే పరిస్థితులతోపాటు అధిక ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కలిగిన నీటి జెట్‌లను కూడా తట్టుకునే సామర్థ్యం ఫోన్‌కు ఉంటుంది. ఇందులో వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను అందించారు. దీనికి తోడు 8 మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో మధ్యలో ఉండే పంచ్-హోల్‌లో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
ఏఐ ఫీచర్లు..
ఆండ్రాయిడ్ ఆధారిత ఆరిజిన్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో ఆరిజిన్ ఐలాండ్ అనే ఇంటర్‌ఫేస్ ఫీచర్‌ను అందించారు. ఫోన్‌లోని పైభాగం కట్‌అవుట్ చుట్టూ నావిగేషన్, మీడియా ప్లేబ్యాక్, టైమర్లు, అలారాలు వంటి డైనమిక్ రియల్‌టైమ్ అలర్ట్‌లను ఇది చూపిస్తుంది. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. విద్యార్థులు, రోజువారీ ఆర్గనైజేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐక్యూ జడ్11లో పలు కృత్రిమ మేధ ఫీచర్లను అందించారు. ఆడియోను రికార్డ్ చేసి దాన్ని ఆటోమేటిక్‌గా లిఖిత రూపంలోకి మార్చడంతోపాటు నిర్మితమైన సారాంశాన్ని రూపొందించే ఏఐ ఆధారిత ట్రాన్స్‌క్రిప్షన్, సమ్మరైజేషన్ సదుపాయం ఇందులో ఉంది. ముఖ్యంగా విద్యార్థులు తరగతి గది ఉపన్యాసాలను రికార్డ్ చేసి, చదువుకునే సమయంలో వాటి సారాంశాలను ఉపయోగించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ టూల్స్..
నోట్ టేకింగ్, డాక్యుమెంట్ తయారీ, డిజిటల్ ఫైళ్ల నిర్వహణను సులభతరం చేసే సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను కూడా ఇందులో ఇచ్చారు. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ యాప్‌లను ఉపయోగించే సమయంలో యాప్‌ల మధ్య వేగంగా మారేందుకు, వనరుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్‌లను అందించారు. ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల 1.5కె 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, హెచ్‌డీఆర్ 10 ప్లస్ ఫీచర్‌లను ఇచ్చినందున పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి 2.0 కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఉన్న 7050 ఎంఏహెచ్ బ్యాటరీకి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.
ధర ఎంతంటే..
ఐక్యూ జడ్11 ఫోన్‌ను అరోరా గ్రీన్, సెలెస్టియల్ బ్లూ రంగుల్లో లాంచ్ చేశారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999 ఉండగా, 8జీబీ, 128జీబీ మోడల్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.44,999గా ఉంది. టాప్ ఎండ్ 12జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించనున్నారు. అమెజాన్ ఇండియా, ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు రిలయన్స్ డిజిటల్, వివో ప్రత్యేక స్టోర్ల వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.1వేయి కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు
- ●Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు
- ●Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను
- ●MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?
- ●Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం

Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు

Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను



