త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ – కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందన్న తండ్రి

పెళ్లి త‌ర్వాత త‌న తొలి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను సొంత ఊరు విరాజ్‌పేట‌లో నిరాడంబ‌రంగా జ‌రుపుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. ర‌ష్మిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కూతురికి ఆమె తండ్రి మ‌ద‌న్ మంద‌న్న ఓ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. సొంత ఊరిలోని ఓ బిల్డింగ్‌ను ర‌ష్మిక‌కు కానుక‌గా అంద‌జేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Apr 10, 2026, 3.43 pm IST

Rashmika Mandanna  | బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ – కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందన్న తండ్రి
Advertisement

Rashmika Mandanna |  పెళ్లి త‌ర్వాత త‌న తొలి పుట్టిన‌రోజును ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా సెల‌బ్రేట్ చేసుకుంది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రియుడు విజ‌య్ దేవ‌రకొండ‌తో క‌లిసి ఏడ‌డుగులు వేసింది ర‌ష్మిక‌. ప‌ది రోజులు పాటు ఘ‌నంగా విరోష్ వివాహ వేడుక‌లు జ‌రిగాయి. ఇటీవ‌లే త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి సొంత ఊరు క‌ర్ణాట‌క‌లోని విరాజ్‌పేట‌కు వెళ్లింది ర‌ష్మిక‌. పెళ్లి త‌ర్వాత తొలిసారి పుట్టింటికి వ‌చ్చిన ర‌ష్మిక‌కు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. సొంత ఊరిలోనే త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య నిరాడంబ‌రంగా జ‌రుపుకుంది ర‌ష్మిక‌. బ‌ర్త్‌డే త‌ర్వాత రోజు కొడ‌వ సంప్ర‌దాయంలో విజ‌య్‌, ర‌ష్మిక వెడ్డింగ్ రిసెప్ష‌న్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. బ‌ర్త్‌డేతో పాటు కొడ‌వ రిసెప్ష‌న్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

కాస్ట్‌లీ గిఫ్ట్‌...

ర‌ష్మిక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కూతురికి ఆమె తండ్రి మ‌ద‌న్ మంద‌న్న కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. విరాజ్‌పేట స‌మీపంలో ఇటీవ‌లే ఓ బిల్డింగ్‌ను కొనుగోలు చేసిన మద‌న్ మంద‌న్న కూతురికి బ‌హుమ‌తిగా అంద‌జేశాడ‌ట‌. ఈ బిల్డింగ్‌కు సెరినిటీ అనే పేరు పెట్టార‌ట‌. తండ్రి ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ర‌ష్మిక ఎమోష‌న‌ల్ అయ్యిన‌ట్లు స‌మాచారం.

కొడ‌గు క‌ల్చ‌ర్‌....

కొడ‌గు క‌ల్చ‌ర్‌తో పాటు మోడ్ర‌న్ ఇంటీరియ‌ర్ ప్ర‌తిబింబించేలా ఈ బిల్డింగ్‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించార‌ట‌. ఫ్రెంచ్ డోర్స్‌, పెద్ద‌ కోర్ట్‌యార్డ్ , విశాల‌మైన లాన్‌తో పాటు చుట్టూ ప‌చ్చ‌ద‌నంతో కూడి ఉంటుంద‌ని అంటున్నారు. ఈ బిల్డింగ్ ఖ‌రీదు ప‌ది కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. ప్రశాంతత, ఏకాంతానికి చిహ్నంగా ఉండ‌టంతోనే ఈ బిల్డింగ్‌కు సెరినిటీ పేరు పెట్టిన‌ట్లు స‌మాచారం.

మూడు సినిమాలు...

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌ష్మిక మంద‌న్న‌. తెలుగులో ర‌ణ‌బాలితో పాటు మైసాలో న‌టిస్తోంది. హిందీలో కాక్‌టెయిల్ 2లో న‌టిస్తోంది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు ర ఆనున్నాయి.

 

Advertisement
Advertisement