త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | రామాయ‌ణ కంటే ప్ర‌భాస్‌ ఆదిపురుష్ ప‌ది రెట్లు బెట‌ర్ – చెత్త మూవీ – బాలీవుడ్ క్రిటిక్ పోస్ట్ వైర‌ల్‌

రామాయ‌ణ ఈ ద‌శాబ్దంలోనే వ‌చ్చిన చెత్త సినిమా అని అన్నారు బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్‌. రామాయ‌ణ కంటే ప్ర‌భాస్ ఆదిపురుష్ ప‌ది రెట్లు బెట‌ర్ అని పేర్కొన్నారు. తొలిరోజు యాభై కోట్ల కూడా రావ‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పారు. క‌మ‌ల్ ఆర్ ఖాన్ చేసిన వ‌రుస పోస్ట్‌లు బాలీవుడ్‌లో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Nov 5, 2026, 7.46 pm IST

Ramayana | రామాయ‌ణ కంటే ప్ర‌భాస్‌ ఆదిపురుష్ ప‌ది రెట్లు బెట‌ర్ – చెత్త మూవీ – బాలీవుడ్ క్రిటిక్ పోస్ట్ వైర‌ల్‌
Advertisement

Ramayana |  ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన రామాయ‌ణ మూవీపై బాలీవుడ్ క్రిటిక్ పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. రామాయ‌ణ మూవీ కంటే ప్ర‌భాస్ ఆదిపురుష్ ప‌ది రెట్లు బెట‌ర్ అని అన్నారు. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రామాయ‌ణ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మైథాల‌జీ మూవీలో రావ‌ణాసురుడిగా క‌న్న‌డ న‌టుడు య‌శ్ క‌నిపించారు.

లంకాధిప‌తిగా...

రామాయ‌ణ మూవీలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, య‌శ్‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ హంగులు బాగున్నాయ‌ని అంటున్నారు. లంకాధిప‌తిగా రావ‌ణుడి ప‌ట్టాభిషేకం, రాముడి జ‌న‌నం, సీత‌తో వివాహం, ప‌ధ్నాలుగేళ్ల వ‌న‌వాసాన్ని, సీతాప‌హ‌ర‌ణం అంశాల‌ను మొద‌టిపార్ట్‌లో నితీష్ తివారీ ఆవిష్క‌రించారు. రామాయ‌ణ మూవీ రికార్డ్ స్థాయిలో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రెడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి.

చెత్త సినిమా....

రామాయ‌ణ మూవీపై బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ చేసిన పోస్ట్‌లు చ‌ర్చ‌నీయాంశమ‌య్యాయి. రామాయ‌ణ ఆ ద‌శాబ్దంలోనే వ‌చ్చిన అత్యంత చెత్త సినిమా అని అత‌డు కామెంట్స్ చేశారు. రామాయ‌ణ‌ కంటే ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీ ప‌ది రెట్లు బెట‌ర్‌. ర‌ణ‌బీర్ క‌పూర్ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ వ‌న్ మాత్ర‌మే. రామాయ‌ణం నుంచి కేవ‌లం ఏడు స‌న్నివేశాల‌ను మాత్ర‌మే తీసుకొని ఎనిమిదేళ్లు టైమ్, రెండు వేల కోట్ల డ‌బ్బు వెచ్చింది మూడున్న‌ర గంట‌ల ర‌న్‌టైమ్‌తో నితీష్ తివారీ ఈ చెత్త సినిమాను తెర‌కెక్కించారు. డ‌బ్బు వృథా త‌ప్ప ఈ సినిమాతో సాధించింది ఏం లేదు. రామాయ‌ణ కోసం నా నాలుగు గంట‌ల టైమ్ వేస్ట్ చేసుకున్నా అని క‌మ‌ల్ ఆర్ ఖాన్ వ‌రుస పోస్ట్‌లు పెట్టారు.

200 కోట్లు...

రామాయ‌ణ మూవీకి తొలిరోజు 200 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని మేక‌ర్స్ అంచ‌నాలు పెట్టుకున్నార‌ని, కానీ యాభై కోట్లు రావ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని క‌మ‌ల్ ఆర్ ఖాన్ వెల్ల‌డించారు. అత‌డి పోస్ట్‌లు వైర‌ల్ అవుతోన్నాయి. రామాయ‌ణ మూవీలో స‌న్నీడియోల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ర‌వి దూబే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

Advertisement
Advertisement