త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhurandhar | బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న ధురంధర్ – మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ!

Dhurandhar | ర‌ణ‌వీర్‌సింగ్ ( Ranveer Singh) హీరోగా న‌టిస్తున్న ధురంద‌ర్ ( Dhurandhar ) మూవీ బాక్సాఫీస్ (Box Office) వ‌ద్ద అద‌ర‌గొడుతుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. ధురంధ‌ర్ మూవీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఆధిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Dec 8, 2025, 1.40 pm IST

Dhurandhar | బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న ధురంధర్ – మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ!

ర‌ణ‌వీర్‌సింగ్

Advertisement

Dhurandhar |ర‌ణ‌వీర్‌సింగ్ (Ranveer Singh)  హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ ధురంధ‌ర్ (Dhurandhar) బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రోజు కంటే మూడో రోజు ఈ స్పై యాక్ష‌న్ మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.
మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ధురంధ‌ర్ మూవీ 106.50 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. మొద‌టి రోజు ఈ సినిమాకు 28 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మౌత్ టాక్ బాగుండ‌టంతో ఆదివారం రోజు 44.80 కోట్ల వ‌సూళ్ల‌తో కుమ్మేసింది. ర‌ణ‌వీర్‌సింగ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా ధురంధ‌ర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ బాలీవుడ్ హీరో కెరీర్‌లో అతి త‌క్కువ రోజుల్లో వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌ సాధించిన మూవీగా నిలిచింది. 3.34 నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ సినిమా భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను షాకింగ్‌కు గురిచేస్తుంది.
ధురంధ‌ర్ మూవీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంజ‌య్ ద‌త్‌, అక్ష‌య్ ఖ‌న్నా, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా న‌టించింది. భార‌త ఇంటెలిజెన్స్ బ్యూరో చేప‌ట్టిన ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ ఆధారంగా ధురంధర్ రూపొందింది. గ‌తంలో వ‌చ్చిన దేశ‌భ‌క్తి, స్పై యాక్ష‌న్ సినిమాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ పాయింట్‌తో డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.
ర‌ణ‌వీర్‌సింగ్ సింగ్‌తో పాటు అక్ష‌య్ ఖ‌న్నా యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెహ‌మాన్ బ‌లోచ్ అనే పాత్ర‌లో త‌న విల‌నిజంతో అక్ష‌య్ ఖ‌న్నా ఆక‌ట్టుకున్నాడ‌ని అంటున్నారు.
పాకిస్థాన్ కుట్ర‌ల‌ను అడ్డుకునేందుకు భార‌త ఇంట‌లిజెన్స్ బ్యూరో ఛీఫ్ అజ‌య్ స‌న్యాల్ (మాధ‌వ‌న్‌) ఓ కొత్త ప్లాన్ వేస్తాడు. పంజాబ్ జైలులో ఉన్న హ‌మ్జా( ర‌ణ‌వీర్‌సింగ్‌) అనే యువ‌కుడిని సీక్రెట్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌కు పంపిస్తాడు. అక్క‌డ హ‌మ్జాకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అత‌డు ఇండియ‌న్ అనే నిజం బ‌య‌ట‌ప‌డిందా? రెహ‌మాన్ బ‌లోచ్ (అక్ష‌య్ ఖ‌న్నా) కార‌ణంగా ఇండియాకు ఎదుర‌వుతున్న ముప్పును హ‌మ్జా ఎలా అడ్డుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement