Dhurandhar 2 | రణవీర్‌సింగ్ ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర 3100 – సినీ లవర్స్ విమర్శలు
రణవీర్‌సింగ్ ధురంధర్ 2 ఓ రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీమియర్స్ బుకింగ్ మంగళవారం ఓపెన్ అయ్యాయి. ఈ పెయిడ్ ప్రీమియర్ల టికెట్ ధరలు ముంబైలో 3100, ఢిల్లీలో 2400 ఉన్నాయి.
Entertainment | Published On Mar 10, 2026, 5.47 pm IST
Dhurandhar 2 | రణవీర్‌సింగ్ ధురంధర్ 2 మూవీ మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది. ధురంధర్ బ్లాక్‌బస్టర్‌తో ఈ బాలీవుడ్ సీక్వెల్‌పై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా హైప్ నెలకొంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో రికార్డ్ సంఖ్యలో థియేటర్లలో ఈ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై ఉన్న బజ్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్‌కు నలభై ఎనిమిది గంటల్లోనే 312 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిరోజు ఈ మూవీ బాక్సాఫీస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.
పెయిడ్ ప్రీమియర్లతో...
కాగా ధురంధర్ 2 ఓ రోజు ముందుగానే థియేటర్లలోకి రాబోతుంది. పెయిడ్ ప్రీమియర్లకు బాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లభించాయి. ఈ పెయిడ్ ప్రీమియర్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను మంగళవారం ఓపెన్ చేశారు.
ముంబై...ఢిల్లీ...
టికెట్ రేట్లు చూసి సినిమా లవర్స్ మాత్రం షాకవుతున్నారు. ముంబైలోని బోరివలి ఐమాక్స్ థియేటర్‌లో రిక్లైనర్స్ టికెట్ ధరలు 3100గా బుక్‌మై షోలో చూపిస్తోంది. ఢిల్లీలోని పీవీఆర్ సెలెక్ట్ సిటీ వాక్ మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్ టికెట్ ధరలు 2400లుగా ఉన్నాయి. రిక్లైనర్స్ కాకుండా మిగిలిన షోస్ టికెట్ ధరలు వెయ్యి నుంచి పన్నెండు వందల మధ్య ఉన్నాయి.
హైదరాబాద్‌లోనే తక్కువ...
ప్రీమియర్స్ టికెట్ ధరలు భారీగా పెంచడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత రేటు పెట్టి సినిమా చూడటం కష్టమేనంటూ కామెంట్లు పెడుతోన్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ముంబై, ఢిల్లీలతో పోలిస్తే సినిమా టికెట్ ధరలు హైదరాబాద్‌లోనే తక్కువగా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లో పెయిడ్ ప్రీమియర్ల టికెట్ ధరలు 295 నుంచి 350 మధ్య ఉన్నాయి.
ఆదిత్య ధర్...
ధురంధర్ ది రివేంజ్ మూవీలో రణవీర్‌సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో రణవీర్‌సింగ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



