త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhurandhar 2 | ధురంధ‌ర్ 2 స్క్రీనింగ్ ఆపేయాలి – త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్‌

ధురంధ‌ర్ 2 మూవీ స్క్రీనింగ్‌ను నిలిపివేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టులో ఎమ‌ర్జెన్సీ పిటిష‌న్ దాఖ‌లైంది. ధురంధ‌ర్ 2లో రాజ‌కీయ అంశాల ప్ర‌స్తావ‌న చాలానే ఉంద‌ని, ఎన్నిక‌లో స‌మ‌యంలో రిలీజ్ చేయ‌డం వ‌ల్ల ఓట‌ర్ల‌పై సినిమా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందంటూ పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On Mar 23, 2026, 7.13 pm IST

Dhurandhar 2 | ధురంధ‌ర్ 2 స్క్రీనింగ్ ఆపేయాలి – త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్‌
Advertisement

Dhurandhar 2 |  బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ధురంధ‌ర్ 2 స్క్రీనింగ్‌ను నిలిపివేయాలంటూ త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన ఈ స్పై యాక్ష‌న్ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చింది. నాలుగు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 761 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఇండియ‌న్ మూవీగా నిలిచింది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌తో పాటు ప‌లు సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.
ధురంధ‌ర్ 2 మూవీ హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా విడుద‌లైంది. హిందీలో మార్చి 19న రిలీజ్ కాగా...ద‌క్షిణాది భాష‌ల్లో మాత్రం సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా రెండు రోజులు ఆల‌స్యంగా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ అద‌ర‌గొడుతోంది.

స్క్రీనింగ్ ఆపేయాలి...

కాగా ధురంధ‌ర్ 2 స్క్రీనింగ్‌ను త‌మిళ‌నాడులో నిలిపివేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఎలక్ష‌న్ కోడ్ అమ‌లులో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ధురంధ‌ర్ 2 సినిమా రిలీజ్‌కు ఎలా అనుమ‌తి ఇచ్చారో చెప్పాలంటూ ఓ లాయ‌ర్ ఎమ‌ర్జెన్సీ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. ధురంధ‌ర్ 2 స్సై యాక్ష‌న్ మూవీ అంటూ సినిమా యూనిట్ పేర్కొంటున్న‌ద‌ని, కానీ ఇందులో రాజకీయ అంశాల ప్ర‌స్తావ‌న చాలానే ఉంద‌ని, ఎన్నికల సమయంలో సినిమాను స్క్రీనింగ్ చేయ‌డం వ‌ల్ల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ధురంధ‌ర్ 2 పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపిన‌ట్లు స‌మాచారం. రిట్ పిటిషన్ వేయాల‌ని సూచించిన‌ట్లు చెబుతున్నారు. ఆ త‌ర్వాతే సినిమా స్క్రీనింగ్ ఆపేయాలా? లేదా? అన్న‌ది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్ప‌ష్టం చేసింద‌ని అంటున్నారు. హైకోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అభినంద‌న‌ల వ‌ర్షం...

ధురంధ‌ర్ 2 మూవీకి ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్పై యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌ణ‌వీర్‌సింగ్ యాక్టింగ్‌తో పాటు ఆదిత్య ధ‌ర్ టేకింగ్‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇండియ‌న్ సినిమాకు ఓ బెంచ్‌మార్క్‌లా ఈ మూవీ నిలిచింద‌ని సినీ వ‌ర్గాల‌తో పాటు ఆడియెన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తోన్నారు.
ధురంధ‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా న‌టించింది. సంజ‌య్ ద‌త్‌, మాధ‌వ‌న్‌, అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement