Deepika Padukone | సినిమాలకు బ్రేక్ – దీపికా పడుకోణ్ కోసం రణ్‌వీర్‌సింగ్ నిర్ణయం
తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణ్ ప్రకటించింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఆరు నెలల పాటు షూటింగ్‌లకు దీపికా పడుకోణ్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. భార్య కోసం రణ్‌వీర్ సింగ్ కూడా సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Jul 13, 2026, 3.30 pm IST
Deepika Padukone | భార్య దీపికా పడుకోణ్ కోసం రణ్‌వీర్‌సింగ్ సినిమాలకు కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వరకు ఏ షూటింగ్‌లలో పాల్గొనకూడదని ఈ బాలీవుడ్ హీరో ఫిక్సైనట్లు చెబుతున్నారు. తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో దీపికా పడుకోణ్ ప్రకటించింది. భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది.
థర్డ్ ట్రైమిస్టర్
ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు ఆరు నెలల పాటు దీపికా పడుకోణ్ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థర్డ్ ట్రైమిస్టర్ కారణంగా ఇబ్బందులు పడుతోన్నానంటూ ఇటీవలే ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది దీపికా. థర్డ్ ట్రైమిస్టర్ వల్ల నిద్రలేమి, అలసట లాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పింది. ప్రెగ్నెన్సీతో షూటింగ్‌లలో పాల్గొనడం ఇబ్బంది కావడంతో ఆగస్ట్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు షూటింగ్‌లలో పాల్గొనకూడదని దీపికా పడుకోణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. భార్య కోసం రణ్‌వీర్‌సింగ్ కూడా సినిమాలకు నాలుగు నెలలు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
జాంబీ హారర్ మూవీ...
ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న రణవీర్‌సింగ్ ప్రస్తుతం ప్రళయ్ పేరుతో ఓ జాంబీ హారర్ మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్ నుంచి ఈ పాన్ ఇండియన్ మూవీ సెట్స్‌పైకి రాబోతుంది. దీపావళి వరకు ఈ సినిమాకు రణ్‌వీర్‌సింగ్ డేట్స్ కేటాయించాడని అంటున్నారు. ఆ తర్వాత నవంబర్ నుంచి నాలుగు నెలల పాటు దీపికా పడుకోణ్ కోసం తాను కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని రణ్‌వీర్ సింగ్ అనుకుంటున్నట్లు అతడి సన్నిహితులు చెబుతున్నారు. రణ్‌వీర్ నిర్ణయంపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అల్లు అర్జున్ రాకా...
ప్రస్తుతం దీపికా పడుకోణ్ తెలుగులో అల్లు అర్జున్‌తో రాకా సినిమా చేస్తోంది. ఇందులో వారియర్ ప్రిన్స్ తరహాలో యాక్షన్ రోల్‌లో కనిపించబోతుంది. దీపికా ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకొని ఆమె పోర్షన్ తాలూకు సీన్లను మేకర్స్ ముందే చిత్రీకరించారట. కొంత టాకీపార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం. ప్రెగ్నెన్సీ బ్రేక్ వల్ల ఈ మిగిలిన సన్నివేశాలను వచ్చే ఏడాది షూట్ చేయనున్నట్లు సమాచారం. రాకా మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. షారుఖ్‌ఖాన్‌తో కలిసి హిందీలో కింగ్ సినిమా చేస్తోంది దీపికా పడుకోణ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను ఇప్పటికే దీపికా కంప్లీట్ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | ఎస్ఎస్ఎస్ – శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
జులై 13, 2026

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
జులై 12, 2026

Ramayana Trailer | రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేశారు – సాయిపల్లవికి మరోసారి అన్యాయం?
జులై 11, 2026
తాజావార్తలు
- ●Sreeleela | ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
- ●Harish Rao | వచ్చే ఎన్నికల్లో రేవంత్ 9 సీట్లు కూడా గెలవడు
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు..
- ●Citizenship Status | పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●Kishan Reddy | తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ.54 వేల కోట్లు బాకీ ఉంది
- ●Yamaha Aerox E | యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 117 కి.మీ. రేంజ్..

Sreeleela | ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!

Harish Rao | వచ్చే ఎన్నికల్లో రేవంత్ 9 సీట్లు కూడా గెలవడు

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు..

Citizenship Status | పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు



