త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh Banned | రణ్‌వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!

షూటింగ్ ముంగిట 'డాన్ 3' మూవీ నుంచి తప్పుకున్న బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ షాక్. ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదుతో ఆయనపై అసోసియేషన్ బ్యాన్ విధించింది.

J

Movies | Published On May 25, 2026, 11.00 pm IST

Ranveer Singh Banned | రణ్‌వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!
Advertisement
  • 'డాన్ 3' (Don 3) సినిమా నుంచి ఆకస్మికంగా తప్పుకున్న రణ్‌వీర్ సింగ్
  • ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదుతో రణ్‌వీర్‌పై 'నాన్ కోఆపరేషన్' బ్యాన్ విధించిన FWICE
  • నిర్మాతలకు జరిగిన రూ.45 కోట్ల నష్టాన్ని రణ్‌వీర్ భరించాలని డిమాండ్
  • నోటీసులకు స్పందించకపోవడంతో ఏ వర్కర్ ఆయనతో పనిచేయకూడదని ఫెడరేషన్ నిర్ణయం

Ranveer Singh Banned | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) చిక్కుల్లో పడ్డాడు. ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'డాన్ 3' (Don 3) ప్రాజెక్టు నుంచి ఆకస్మికంగా తప్పుకున్నందుకు ఆయన భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఈ వివాదంపై తీవ్రంగా స్పందించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE), సోమవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ రణ్‌వీర్‌పై Non-cooperation బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

మూడు వారాల ముందు హ్యాండ్

ఏప్రిల్ 11న డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిధ్వానీ (Excel Entertainment) ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేశారు. షూటింగ్ ప్రారంభించడానికి కేవలం మూడు వారాల ముందు రణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయిందని, దీనివల్ల ఉపాధి నమ్ముకున్న వేలాది మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు నష్టపోయారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నిర్మాతలు ఫెడరేషన్ మీటింగ్‌కు స్వయంగా, వర్చువల్‌గా హాజరై తమ బాధను వివరించారు.

Ranveer Singh Banned by FWICE After Abrupt Exit from Don 3

మూడు సార్లు నోటీసులు ఇచ్చినా

ఈ వివాదంపై తమ వెర్షన్ వినిపించాలని కోరుతూ FWICE రణ్‌వీర్ సింగ్‌కు మూడుసార్లు ఫార్మల్ నోటీసులు పంపింది. అయినా ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. తీరా ప్రెస్ మీట్ పెట్టి బ్యాన్ అనౌన్స్ చేసే సమయానికి రణ్‌వీర్ టీమ్ స్పందిస్తూ.. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు (Jurisdiction) ఫెడరేషన్‌కు లేదంటూ ఒక మెయిల్ పంపింది. అప్పీలేట్ ఫోరమ్‌లోనే తాను ఈ సమస్యను తేల్చుకుంటానని రణ్‌వీర్ స్పష్టం చేశారు.

ఎవరూ ఇండస్ట్రీ కంటే గొప్ప కాదు

రణ్‌వీర్ తీరుపై ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ అందరికీ ఒకటేనని, ఒక సూపర్ స్టార్ అయినా సరే ఇండస్ట్రీ నిబంధనల కంటే గొప్ప కాదని FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ స్పష్టం చేశారు. "ఇప్పటి నుంచి మా ఫెడరేషన్‌కు చెందిన ఏ ఒక్క వర్కర్ లేదా టెక్నీషియన్ రణ్‌వీర్‌తో కలిసి పనిచేయరు" అని తేల్చిచెప్పారు. ఇది వేలాది మంది సినీ కార్మికుల ఉపాధికి సంబంధించిన విషయమని అన్నారు.

Ranveer Singh Banned by FWICE After Abrupt Exit from Don 3

రూ.45 కోట్లు కట్టాల్సిందే

మరోవైపు, తమకు జరిగిన రూ.45 కోట్ల ప్రీ-ప్రొడక్షన్ నష్టాన్ని రణ్‌వీర్ సింగ్ భరించాల్సిందేనని 'ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్' సంస్థ డిమాండ్ చేస్తోంది. గతంలో కుదుర్చుకున్న మూడు సినిమాల కాంట్రాక్టును (Multi-film contract) ఆయన ఉల్లంఘించారని ఆరోపించింది. మొత్తానికి 'డాన్ 3' చుట్టూ అలుముకున్న ఈ వివాదం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా 'ధురంధర్ 2' (Dhurandhar 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణ్‌వీర్.. ఇప్పుడు ఈ బ్యాన్ నుంచి ఎలా బయటపడతాడనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement