త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hema Malini | భ‌ర్త త‌ర‌ఫున ప‌ద్మ‌విభూష‌ణ్‌ అందుకున్న హేమ‌మాలిని – వేదిక‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డ్రీమ్ గర్ల్

ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక సోమ‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో బాలీవుడ్ న‌టుడు ధ‌ర్మేంద్ర ఆయ‌న స‌తీమ‌ణి హేమామాలిని ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును స్వీక‌రించింది. భ‌ర్త త‌ర‌ఫున అవార్డు అందుకుంటూ హేమామాలిని ఎమోష‌న‌ల్ అయ్యింది. మ‌ర‌ణానంత‌రం ధ‌ర్మేంద్ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On May 25, 2026, 8.44 pm IST

Hema Malini | భ‌ర్త త‌ర‌ఫున ప‌ద్మ‌విభూష‌ణ్‌ అందుకున్న హేమ‌మాలిని – వేదిక‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డ్రీమ్ గర్ల్
Advertisement

Hema Malini |  ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక సోమ‌వారం న్యూఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌తో పాటు ప‌ద్మ‌శ్రీ  గ్ర‌హీత‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అవార్డుల‌ను అంద‌జేశారు. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు ధ‌ర్మేంద్ర‌కు మ‌ర‌ణానంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డును ధ‌ర్మేంద్ర త‌ర‌ఫున ఆయ‌న భార్య‌ హేమ‌మాలిని అందుకుంది.

ఎమోష‌న‌ల్‌...

ప‌ద్మ‌విభూష‌ణ్ స్వీక‌రించ‌డానికి కూతురు అహానా డియోల్‌తో క‌లిసి హేమ‌మాలిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. హేమమాలిని అవార్డును స్వీకరించడానికి వేదిక వైపు వెళుతున్న‌ సమయంలో అహాన డియోల్ క‌న్నీళ్లు పెట్టుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో హేమమాలిని కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఉబికి వ‌స్తోన్న క‌న్నీళ్ల‌ను అపుకుంటూ అవార్డును స్వీక‌రించింది హేమ‌మాలిని. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

బాబీ డియోల్‌, స‌న్నీడియోల్ మిస్‌...

"త‌న జీవితంలోని మోస్ట్ ఎమోష‌న‌ల్ మూవ్‌మెంట్ ఇద‌ని, ధ‌ర్మేంద్ర‌కు అవార్డు రావ‌డం ప‌ట్ల మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంద‌ని" ప‌ద్మ‌విభూష‌ణ్ స్వీక‌రించ‌డానికి ముందు హేమామాలిని అన్న‌ది. కాగా ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వ వేడుక‌లో ధ‌ర్మేంద్ర త‌న‌యులు, బాలీవుడ్ హీరోలు స‌న్నీ డియోల్‌, బాబీ డియోల్ అటెండ్ కాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌మ్ముట్టి...మాధ‌వ‌న్‌...

ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపికైన మ‌మ్ముట్టి, ఆర్ మాధ‌వ‌న్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోమ‌వారం అవార్డుల‌ను స్వీక‌రించారు. ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక‌లో ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, హో మంత్రి అమిత్ షాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement