త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | అఫీషియ‌ల్ – రామాయ‌ణ రిలీజ్ డేట్ ఫిక్స్ – మైథాల‌జీ మూవీపై క‌నిపించ‌ని బ‌జ్‌

రామాయ‌ణ పార్ట్ 1 రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 5న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి సీతారాముడి పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమాలో రావ‌ణాసురుడిగా య‌శ్ క‌నిపించ‌బోతున్నారు. రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ మేక‌ర్స్ ఆదివారం కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Oct 11, 2026, 6.26 pm IST

Ramayana | అఫీషియ‌ల్ – రామాయ‌ణ రిలీజ్ డేట్ ఫిక్స్ – మైథాల‌జీ మూవీపై క‌నిపించ‌ని బ‌జ్‌
Advertisement

Ramayana |  ర‌ణ‌బీర్‌క‌పూర్‌ (Ranbir Kapoor) , సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) జంట‌గా న‌టిస్తోన్న రామాయ‌ణ పార్ట్ 1 రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఆదివారం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో మేక‌ర్స్ విడుద‌ల తేదీని వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 5న ఈ మైథాల‌జీ మూవీని థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌...

కొత్త పోస్ట‌ర్‌లో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి, ర‌వి దూబేతో పాటు య‌శ్ క‌నిపిస్తోన్నారు. ఈ పోస్ట‌ర్‌లో రావ‌ణాసురుడిగా య‌శ్‌ను ఎక్కువ‌గా హైలైట్ చేశారు. సీతారాముడి వ‌న‌వాసం కాలం నాటి గెటెప్‌లో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బుకింగ్స్ ఓపెన్‌...

రామాయ‌ణ (Ramayana) పార్ట్ వ‌న్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప‌దిహేను రోజుల ముందే నుంచే ఓపెన్ కానున్న‌ట్లు స‌మాచారం. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20 నుంచి బుకింగ్స్ ప్రారంభించ‌నున్నట్లు సమాచారం. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ చేస్తోన్నారు. అందుకు త‌గ్గ‌ట్లే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ వీక్ నుంచి రిలీజ్ డేట్ వ‌ర‌కు వ‌రుస‌గా ఇర‌వై ఐదు రోజుల పాటు దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కొన్ని ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు స‌మాచారం. వివిధ భాష‌ల‌కు చెందిన సూప‌ర్ స్టార్స్ ఈ వేడుక‌ల్లో పాల్గొనున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

క‌నిపించ‌ని బ‌జ్‌...

రామాయ‌ణ మూవీ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతోంది. దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ ఈ మైథాల‌జీ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. బాలీవుడ్‌తో పాటు సౌత్ స్టార్స్ ఈ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రిలీజ్‌కు నెల రోజుల కంటే త‌క్కువే టైమ్ ఉంది. అయినా రామాయ‌ణ పార్ట్ వ‌న్‌పై స‌రైన బ‌జ్ క‌నిపించ‌డం లేదు.
పాన్ ఇండియ‌న్ లెవెల్ ఈ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో మేక‌ర్స్ విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు గ్రాండ్‌గా ఒక్క ఈవెంట్ కూడా చేయ‌లేక‌పోయారు. సీత‌గా సాయిప‌ల్ల‌వి ఎంపిక‌తో పాటు గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్‌పై విమ‌ర్శ‌లు రావ‌డం కూడా సినిమాపై హైప్ త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ విమ‌ర్శ‌ల‌కు రానున్న ఈవెంట్స్‌లో మేక‌ర్స్ ఎలా బ‌దులిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దేశవ్యాప్తంగా బజ్ తీసుకురావడం కూడా దర్శకనిర్మాతలకు సవాల్ గా మారింది.

హ‌నుమంతుడిగా...

రామాయ‌ణ‌లో హ‌నుమంతుడిగా స‌న్నీడియోల్ క‌నిపించ‌బోతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, లారా ద‌త్తాతో పాటు ప‌లువురు అగ్ర న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రామాయ‌ణ మూవీకి హ‌న్స్ జిమ్మ‌ర్‌తో క‌లిసి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. రామాయ‌ణ రెండో పార్ట్ వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement