Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ – ప్రమోషన్స్ షురూ
వినాయక చవితి సందర్భంగా రామాయణ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సీతారాముడిగా రణభీర్‌కపూర్, సాయిపల్లవి డివైన్ లుక్‌లో కనిపిస్తున్నారు. రామాయణ పార్ట్ 1 దీపావళికి థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Sep 14, 2026, 11.03 am IST
Sai Pallavi |వినాయక చవితి సందర్భంగా రామాయణ మేకర్స్ స్పెషల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రాముడిగా రణభీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి డివైన్ లుక్‌లో కనిపిస్తున్నారు. అడవిలో ఓ సరస్సు ఒడ్డున ఉన్న రాయిపై ఇద్దరు కూర్చొని ఉన్నారు. సీత జడలో రాముడు పువ్వు పెడుతున్నట్లు ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌తో వినాయక చవితి నుంచి అఫీషియల్‌గా రామాయణ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
కలర్‌ఫుల్ సాంగ్...
పోస్టర్‌తో పాటు రామ్ సియా రామ్ జై జై రామ్ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. సీతారాముల పెళ్లి నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా ఈ పాట సాగింది. విజువల్స్, లిరిక్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
విమర్శల నేపథ్యంలో...
రామాయణ నుంచి మేకర్స్ సాయిపల్లవి పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో నాచురల్ బ్యూటీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ట్రైలర్ మినహా ఇప్పటివరకు రామాయణ నుంచి సాయిపల్లవి పాత్రకు సంబంధించి ఎలాంటి పోస్టర్, గ్లింప్స్ విడుదల కాలేదు. రణభీర్ కపూర్‌తో పాటు రావణాసురుడిగా నటించిన యశ్ పాత్రలకే ప్రమోషన్స్‌లో ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని, సాయిపల్లవిని పట్టించుకోవడం లేదంటూ ఆమె ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా మేకర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఎక్కువైపోవడంతోనే ఎట్టకేలకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రెండు పార్ట్‌లుగా...
రామాయణ మూవీ దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందుతోంది. పార్ట్ 1 దీపావళికి థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. రావణాసురుడిగా యశ్ నటిస్తోండగా...అతడి భార్య మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తుంది. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది.
హనుమంతుడిగా సీనియర్ హీరో సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ మూవీ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ – గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
సెప్టెంబర్ 12, 2026

Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం – పనిమనిషి అరెస్ట్
సెప్టెంబర్ 12, 2026

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
- ●Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్

Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!



