Rakul Preet Singh | రకుల్ కొత్త ప్రయోగం.. సక్సెస్ అవుతుందా.. బెడిసికొడుతుందా?
Rakul Preet Singh | గ్లామర్ పాత్రలతో తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఓ విభిన్నమైన పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నది. భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన ఈ పాత్ర కాగా.. నటిగా రకుల్‌కు కొత్త కోణాన్ని పరిచయం చేసే అవకాశం దక్కింది.
Entertainment | Published On Aug 5, 2026, 8.48 pm IST
Rakul Preet Singh | గ్లామర్ పాత్రలతో తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఓ విభిన్నమైన పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నది. భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన ఈ పాత్ర కాగా.. నటిగా రకుల్‌కు కొత్త కోణాన్ని పరిచయం చేసే అవకాశం దక్కింది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రకుల్ పోషిస్తున్న శూర్పణఖ పాత్ర కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పురాణాల్లో శూర్పణఖను సాధారణంగా ప్రతికూల ఛాయలతోనే చూపిస్తుంటారు.
అయితే, దర్శకుడు నితీశ్ తివారీ ఈ పాత్రను తెరపై ఎలా ఆవిష్కరించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్‌లో రకుల్ కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శూర్పణఖ పాత్రలో ఆమె లుక్, హావభావాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రకుల్.. ఈ సినిమాలో భావోద్వేగాలు, ప్రతికూలతలు, సంక్లిష్టతలతో కూడిన పాత్రను ఎలా పండిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పాత్రను అంగీకరించడానికి కారణం శూర్పణఖ వ్యక్తిత్వంలోని సంక్లిష్టతేనని రకుల్ తెలిపారు. సాధారణంగా ప్రేక్షకులు ఒక కోణంలో మాత్రమే చూసే పాత్రలను కొత్త దృష్టితో చూపించే అవకాశం నటిగా తనకు ఆసక్తిని కలిగిస్తుందని పేర్కొంది.
‘శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతే నన్ను ఆకట్టుకుంది. చరిత్ర ఆమెను ఒకే సంఘటనతో గుర్తుంచుకుంటుంది. కానీ ఆమె కథలో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి. నటుడిగా మన ఆలోచనలను సవాల్ చేసే పాత్రలే మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ‘రామాయణం’ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆమె పాత్రను ఓ కొత్త దృష్టితో చూడాలని ఆశిస్తున్నాను’ అని రకుల్ కోరింది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది రకుల్. ఇటీవల టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశారు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న ఆమెకు ‘రామాయణం’లోని శూర్పణఖ పాత్ర మరో కీలక అవకాశం.
భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ‘రామాయణం’లో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో రకుల్ పోషిస్తున్న శూర్పణఖ పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తన అందంతో ఆకట్టుకున్న రకుల్.. ఈసారి నటనలోని మరో కోణాన్ని చూపించగలరా? శూర్పణఖ పాత్రతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటారా? అన్నది సినిమా విడుదల తర్వాతే తేలనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ – కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 27, 2026

No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన
సెప్టెంబర్ 27, 2026

MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్
- ●Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్
- ●John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
- ●MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
- ●KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్

Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్

John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!



