త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Tanker | హైవేపై పెట్రోల్ ట్యాంక‌ర్ బోల్తా.. భారీ పేలుడుతో 31 మంది స‌జీవ ద‌హ‌నం

Fuel Tanker | ఈజిప్టు (Egypt,) రాజధాని కైరో సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కైరో శివారు ప్రాంతంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్ (Fuel Tanker) అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఒక్క‌సారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది.

G

International | Published On Nov 26, 2026, 7.57 am IST

Fuel Tanker | హైవేపై పెట్రోల్ ట్యాంక‌ర్ బోల్తా.. భారీ పేలుడుతో 31 మంది స‌జీవ ద‌హ‌నం
Advertisement

Fuel Tanker | త్రినేత్ర న్యూస్‌: ఈజిప్టు (Egypt,) రాజధాని కైరో సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కైరో శివారు ప్రాంతంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్ (Fuel Tanker) అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఒక్క‌సారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మ‌ర‌ణించారు. మ‌రో 21 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ర‌హ‌దారిపై వెళ్తున్న సుమారు 27 వాహ‌నాలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి.

బుధువారం రాత్రి ఓ ప్రైవేటు ట్యాంక‌ర్‌ పెట్రోలియం ఉత్ప‌త్తులను తీసుకెళ్తున్న‌ది. గ్రైట‌ర్‌ కైరో (Cairo) శివారులోని గిజా (Giza) ప్రాంతం, ఇంబాబా జిల్లాలోని అల్-వార్రాక్ (Al-Warraq) వ‌ద్ద ట్యాంక‌ర్‌పై డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోయాడు. దీంతో అదుపుత‌ప్పిన ట్యాంక‌ర్ డివైడ‌ర్‌ను ఢీకొట్టి బోల్తా ప‌డింది. అనంతరం చెలరేగిన మంటలు వేగంగా ఇతర వాహనాలకు వ్యాపించాయి. హైవేపై వెళ్తున్న వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో చాలా మంది వాహనాల్లోనే కాలిపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కార్లలో చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, బాధితులను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు. కాగా, ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సీసీ (Abdel-Fattah el-Sisi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement