త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | రిలీజ్ డేట్ మారింది – ర‌ణ‌భీర్, అలియా ల‌వ్ అండ్ వార్ పోస్ట్‌పోన్

బాలీవుడ్ రియ‌ల్ లైఫ్ క‌పుల్ ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా న‌టించిన ల‌వ్ అండ్ వార్ మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను 2027కు వాయిదా వేశారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను దర్శకనిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Apr 17, 2026, 2.58 pm IST

Alia Bhatt | రిలీజ్ డేట్ మారింది – ర‌ణ‌భీర్, అలియా ల‌వ్ అండ్ వార్ పోస్ట్‌పోన్
Advertisement

Alia Bhatt | రియ‌ల్ లైఫ్ క‌పుల్ ర‌ణ‌భీర్ కపూర్, అలియా భ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ ల‌వ్ అండ్ వార్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఏకంగా వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ శుక్ర‌వారం రివీల్ చేశారు. 2027 జ‌న‌వ‌రి 21న ల‌వ్ అండ్ వార్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

స్క్రిప్ట్‌లో ఛేంజేస్ కార‌ణమా?

ఈ ఏడాది స‌మ్మ‌ర్ నుంచి వ‌చ్చే ఏడాదికి ల‌వ్ అండ్ వార్ మూవీ రిలీజ్‌ను షిప్ట్ చేయ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పోస్ట్‌పోన్‌కు సంబంధించి ప‌లు కార‌ణాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌ణ‌భీర్ క‌పూర్ రామాయ‌ణ, విక్కీ కౌశ‌ల్ మ‌హావ‌తార్ సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు. వీరిద్ద‌రి కంబైండ్ డేట్స్ అడ్జెస్ట్ కావ‌డం క‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ ప‌నుల డిలే కూడా ఇందుకు తోడ‌వ్వ‌డంతో రిలీజ్ డేట్‌ను మార్చాల్సివ‌చ్చింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వ‌ర్గాలు మాత్రం ఈ వాయిదాకు సంజ‌య్ లీలా భ‌న్సాలీ స్క్రిప్ట్‌లో చేసిన మార్పులు కార‌ణ‌మ‌ని కామెంట్లు చేస్తున్నారు. స్క్రిప్ట్ ఇంప్రూవైజేష‌న్ పేరుతో క‌థ‌లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ చాలానే ఛేంజెస్ చేశార‌ట‌. వీటి వ‌ల్ల షూటింగ్ చాలా రోజులు ఆగిపోయింద‌ట‌. దీపావ‌ళికి ర‌ణ‌భీర్ క‌పూర్ రామాయ‌ణ సినిమా రిలీజ్ కూడా ఉండ‌టంతోనే జ‌న‌వ‌రికి ల‌వ్ అండ్ వార్ వెళ్లిపోయింద‌ని అంటున్నారు.

ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్లు...

ల‌వ్ అండ్ వార్ మూవీలో విక్కీ కౌశ‌ల్ మ‌రో హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో ర‌ణ‌భీర్‌క‌పూర్‌, విక్కీ కౌశ‌ల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీస‌ర్లుగా న‌టిస్తున్నారు. ఓ అమ్మాయి కార‌ణంగా ప్రాణ స్నేహితులైన వారి మ‌ధ్య ఎలా విభేదాలు వ‌చ్చాయి? దేశం కోసం పోరాడాల్సిన ఆ ఇద్ద‌రూ ప్రేమ కోసం ఎలాంటి యుద్ధం చేశార‌నే అంశాల‌తో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది.

తెలుగులోనూ రిలీజ్‌...

ల‌వ్ అండ్ వార్ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌క‌టించాడు. తెలుగు వెర్ష‌న్ కోసం భారీగానే ప్ర‌మోష‌న్స్ చేయ‌బోతున్నార‌ట‌.

Advertisement
Advertisement