త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో రియాలిటీ షో – బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ – హోస్ట్‌గా సీనియ‌ర్ హీరోయిన్‌

రొమాంటిక్ రియాలిటీ షో కోసం సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా మారింది. సెకండ్ ల‌వ్ తెర‌కెక్కుతోన్న ఈ షో ఏ ఓటీటీలో...ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

N

Entertainment | Published On Jun 18, 2026, 7.42 am IST

OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో  రియాలిటీ షో – బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ – హోస్ట్‌గా సీనియ‌ర్ హీరోయిన్‌
Advertisement

OTT | ఓ వైపు సినిమాలు చేస్తూనే రియాలిటీ, టాక్ షోస్‌కు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు స్టార్స్‌. బిగ్‌బాస్ షోతో నాగార్జున హోస్ట్‌గా బిగ్గెస్ట్ స‌క్సెస్‌ను అందుకున్నారు. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ తెలుగు టాక్ షోల‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.

సెకండ్ ల‌వ్‌....

తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా మార‌బోతుంది. ఓటీటీ షోతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సెకండ్ ల‌వ్ పేరుతో రొమాంటిక్ రియాలిటీ షోను జియో హాట్ స్టార్ లాంఛ్ చేయ‌బోతుంది. బిగ్‌బాస్‌కు పోటీగాప్రారంభం కానున్న‌ ఈ సిరీస్‌కు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా క‌నిపించ‌బోతుంది. ల‌వ్‌లో ఫెయిలైన కొంద‌రు అమ్మాయిలు, అబ్బాయిలు ఓ విల్లాలోకి అడుగుపెడ‌తారు. అక్క‌డ మ‌రోసారి ఎలా ప్రేమ‌లో ప‌డ‌తారు? వారి సెకండ్ ల‌వ్ స్టోరీ ఎలా సాగింద‌నే అంశాల‌తో ఈ రియాలిటీ షో సాగ‌నుంద‌ట‌.

జూలైలో స్ట్రీమింగ్‌....

త‌మిళంలో టెలికాస్ట్ కానున్న ఈ షోలో ప‌లువురు టీవీ, సోష‌ల్ మీడియా సెలిబ్రిటీల‌తో పాటు కొంద‌రు కామ‌న్ మ్యాన్స్ కూడా కంటెస్టెంట్స్‌గా పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. తెలుగులోనూ సెకండ్ ల‌వ్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. జూలైలో ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కాబోతుంది.

హోస్ట్‌గానే కాకుండా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేస్తూ ర‌మ్య‌కృష్ణ బిజీగా ఉంది. అల్లు అర్జున్ రాకాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. పాక‌శాల పంతం పేరుతో ర‌మ్య‌కృష్ణ చేసిన మ‌రో తెలుగు మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

 

Advertisement
Advertisement