త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | ఏపీ ముఖ్య‌మంత్రిగా ర‌మ్య‌కృష్ణ – ల‌క్ష్మి ప్ర‌ణ‌తి లుక్ రిలీజ్‌

సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఏపీ సీఎం పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్ యామినీ ఈఆర్ హీరోయిన్‌గా క్వీన్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో ఏపీ సీఎం ల‌క్ష్మి ప్ర‌ణ‌తి అనే క్యారెక్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Jul 11, 2026, 7.43 pm IST

Tollywood  | ఏపీ ముఖ్య‌మంత్రిగా ర‌మ్య‌కృష్ణ – ల‌క్ష్మి ప్ర‌ణ‌తి లుక్ రిలీజ్‌
Advertisement

Tollywood | సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఏపీ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ యామినీ ఈఆర్ హీరోయిన్‌గా క్వీన్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు ర‌త‌న్ రిషి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. క్వీన్ మూవీలో ర‌మ్య‌కృష్ణ ఏపీ ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో ఆమె ల‌క్ష్మి ప్ర‌ణ‌తి అనే క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ బ్లాక్ అండ్ వైట్ ఫొటో...వాటిపై పేప‌ర్ న్యూస్ క‌టింగ్స్‌, అసెంబ్లీ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

విల‌న్లుగా...

శ‌నివారం నుంచే ర‌మ్య‌కృష్ణ క్వీన్ మూవీ షూటింగ్‌లో జాయినైంది. ఆమె న‌ట‌న‌, పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయ‌ట‌. ఈ ఈ సినిమాలో కాళ‌కేయ ప్ర‌భాక‌ర్‌, అజ‌య్ ఘోష్ విల‌న్లుగా న‌టించ‌బోతున్నారు. సాయికుమార్ తో పాటు త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌వీన్ బేతిగంటి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో...

క్వీన్ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006-2010 మ‌ధ్య కాలంలో ఈ క‌థ సాగుతుంద‌ట‌. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఇందులో చూపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. క్వీన్ మూవీకి భ‌ర‌త్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్వీన్ సినిమాతోనే యామినీ ఈఆర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతుంది.

 

Advertisement
Advertisement