త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | మెగా ట్విన్స్ పేర్లు ఇవే.. వెల్ల‌డించిన రామ్‌చరణ్‌

Ram Charan | స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ (RamCharan), ఉపాస‌న (Upasana) దంప‌తుల‌కు ఇటీవ‌లే క‌వ‌లలు (Twins) పుట్టిన విషయం తెలిసిందే. జన‌వ‌రి 31న ఉపాస‌న‌కు ఒక బాబు, పాప జ‌న్మించారు. రామ్‌చరణ్‌ ఇప్పుడు తన పిల్లల పేర్లు వెల్లడించారు.

G

Entertainment | Published On Feb 13, 2026, 8.06 am IST

Ram Charan | మెగా ట్విన్స్ పేర్లు ఇవే.. వెల్ల‌డించిన రామ్‌చరణ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌ల పిల్ల‌ల పేర్ల‌ను మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌న‌వ‌డికి శివ‌రామ్‌, మ‌న‌వ‌రాలికి అన్వీరాదేవి పేరు పెట్టారు.

Advertisement

Ram Charan | త్రినేత్ర‌.న్యూస్‌: స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ (RamCharan), ఉపాస‌న (Upasana) దంప‌తుల‌కు ఇటీవ‌లే క‌వ‌లలు (Twins) పుట్టిన విషయం తెలిసిందే. జన‌వ‌రి 31న ఉపాస‌న‌కు ఒక బాబు, పాప జ‌న్మించారు. ఇప్ప‌టికే వారికి ఒక కూతురు ఉన్నది. కాగా, మెగా ట్విన్స్ బార‌సాల ఈనెల 11న జ‌రిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారికి నామ‌క‌ర‌ణం చేశారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ వారి పిల్లల పేర్లు వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్‌ (Shivram), అమ్మాయి పేరు అన్విరా దేవి (Anveera Devi) అని పెట్టినట్లు చెప్పారు.

కుమార్తె పేరుకు ధైర్య‌వంతురాలు అనే అర్ధం వ‌స్తుంద‌ని, ఇక కుమారుడికి చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ పేర్లు క‌లిసేలా శివ‌రామ్ అని పెట్టార‌ని సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తున్న‌ది. అన్న‌ట్లు చిరంజీవి అస‌లు పేరు శివ శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ అని తెలుసే క‌దా!. ఇటీవ‌ల చిరూ.. త‌న పేరునే టైటిల్‌గా పెట్టి సినిమా తీసిన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి విడుద‌లైన ఆ మూవీ సూప‌ర్‌హిట్ అవ‌డ‌మే కాకుండా, భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Advertisement
Advertisement