త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | పీరియాడిక‌ల్ బాట ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు – ఇప్పుడిదే ట్రెండ్

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పీరియాడిక‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్, ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు హీరోలు పీరియాడిక‌ల్ క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నారు.

N

Entertainment | Published On Dec 19, 2025, 9.26 am IST

Tollywood |  పీరియాడిక‌ల్ బాట ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు – ఇప్పుడిదే ట్రెండ్

Tollywood

Advertisement

సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టుల భ‌విష్య‌త్తును జ‌యాప‌జ‌యాలే నిర్ణ‌యిస్తాయి. స‌క్సెసుల్లో ఉన్న యాక్ట‌ర్ల చుట్టే ఇండ‌స్ట్రీ తిరుగుతుంది. నేమ్‌, ఫేమ్‌, రెమ్యూన‌రేష‌న్‌తో పాటు అన్నింటిలో స‌క్సెసుల్లో ఉన్న హీరోలే టాప్‌లో ఉంటారు.  విజ‌యాల కోస‌మే ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌క్సెస్‌కు కంటెంట్ కీల‌కంగా మారింది. ఇదివ‌ర‌కు ఆరు పాట‌లు, మూడు ఫైట్ల తో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాను ఫాలో అయ్యేవారు హీరోలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త‌ద‌నం లేకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా ఆడియెన్స్ నిర్మొహ‌మాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఆడియెన్స్‌ను మెప్పించ‌డం కోసం హీరోలు త‌ర‌చుగా ట్రెండ్స్ మారుస్తూనే ఉన్నారు.
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో భ‌క్తి క‌థ‌ల‌తో పాటు పీరియాడిక‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. చ‌రిత్ర‌లో వెన‌క్కి వెళుతూ అల‌నాటి కాలం క‌థ‌ల‌తో అభిమానుల‌ను అల‌రించేందుకు టాలీవుడ్‌ హీరోలు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు న‌టిస్తున్న కొన్ని పీరియాడిక‌ల్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఆరంభం నుంచే అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాలు ఏవంటే?

రామ్ చ‌ర‌ణ్ పెద్ది...

రంగ‌స్థ‌లం, ఆర్ఆర్ఆర్ త‌ర్వ‌త పెద్ది మూవీతో మ‌రోసారి పీరియాడిక‌ల్ జాన‌ర్‌ను ట‌చ్ చేస్తున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
స్వ‌యంభూతో ఫ‌స్ట్ టైమ్ హీరో నిఖిల్ పీరియాడిక‌ల్ క‌థ‌తో సినిమా చేస్తున్నారు. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇందులో యోధుడి పాత్ర‌లో నిఖిల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సంయుక్త మీన‌న్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు.

ప్ర‌భాస్ ఫౌజీ

ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఫౌజీ మూవీ నిజాం న‌వాబుల‌ కాలం నాటి క‌థ‌తో రూపొందుతోంది. 1932 టైమ్ పీరియ‌డ్‌లో ఈ సినిమా సాగుతుంద‌ని ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్ర‌భాస్ సైనికుడి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం.
మిరాయ్ మూవీతో రీఎంట్రీలో అద‌ర‌గొట్టిన మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం డేవిడ్ రెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బ్రిటీష్ కాలం నాటి క‌థ‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా మంచు మ‌నోజ్ క‌నిపించ‌బోతున్నాడు. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ మేక హీరోగా న‌టిస్తున్న ఛాంపియ‌న్ మూవీ ట్రైల‌ర్ గురువారం రిలీజైంది. తెలంగాణ సాయుధ పోరాటం నేప‌థ్యంలో భైరాన్ ప‌ల్లి ఘ‌ట‌న ఆధారంగా ఛాంపియ‌న్ రూపొందుతున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా చూపించారు. ఈ సినిమాకు ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇవే కాకుండా బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని మూవీ, గోపీచంద్ - సంక‌ల్ప్‌రెడ్డి సినిమాతో పాటు మ‌రికొన్ని పీరియాడిక‌ల్  కథలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల అలరించనున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement