Peddi Movie | విమర్శల ఎఫెక్ట్ – ఆ సీన్లను డిలీట్ చేయనున్న మేకర్స్ – రామ్‌చరణ్ పెద్ది రీ సెన్సార్
రామ్‌చరణ్ పెద్ది మూవీని మేకర్స్ రీ సెన్సార్ చేయబోతున్నారట. ఆడియెన్స్ నుంచి వస్తోన్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను డిలీట్ చేయబోతున్నారట. కొత్త సీన్లను సినిమాకు యాడ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 9, 2026, 2.47 pm IST
Peddi Movie | రామ్‌చరణ్ పెద్ది మూవీని మేకర్స్ రీ సెన్సార్ చేయబోతున్నారట. సినిమాలోని కొన్ని సీన్లను డిలీట్ చేయడమే కాకుండా మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రీ సెన్సార్ వెర్షన్ బుధవారం లేదా గురువారం నుంచి థియేటర్లలో స్క్రీనింగ్ కానున్నట్లు సమాచారం.
ఫ్లాష్‌బ్యాక్
సెకండాఫ్‌లో కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొన్ని సీన్లు బోర్‌గా ఉన్నాయని ఆడియెన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయట. ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొని శివరాజ్‌కుమార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు కుస్తీ ప్రాక్టీస్‌కు సంబంధించిన కొన్ని సీన్లను సినిమా నుంచి డిలీట్ చేయబోతున్నారట. వాటితో పాటు సినిమాలో జాన్వీ కపూర్ రోల్ లెంగ్త్‌ను తగ్గించనున్నారట. ముద్దు సీన్లతో పాటు జాన్వీ ఎన్నికల ప్రచారం సీన్లను కట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
కొత్త సీన్లు యాడ్...
రామ్‌చరణ్, జగపతిబాబులపై చిత్రీకరించిన కొత్త సీన్లను సినిమాకు యాడ్ చేయబోతున్నారట. అలాగే సత్య కామెడీ సీన్లను కూడా సినిమాకు జోడించనున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త సన్నివేశాల కోసమే సినిమాను రీ సెన్సార్ చేయించబోతున్నట్లు సమాచారం. సినిమా నిడివి ఎక్కువైపోయిందనే ఆలోచనతో రామ్‌చరణ్, జగపతిబాబు సీన్లను తొలుత తగ్గించారట. కానీ జగపతిబాబు ట్రాక్‌కు మంచి రెస్పాన్స్ రావడంతోనే మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
315 కోట్లు...
పెద్ది మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 315 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ సెకండ్ మూవీగా నిలిచింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు.
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ – భగవంత్ కేసరి కాంబో రిపీట్
జూన్ 9, 2026

Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ – రామ్‌చరణ్ అదరగొట్టేశాడు – పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
జూన్ 9, 2026

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ – అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Lok Sabha | మరోసారి లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు..?
- ●Rakesh Reddy | ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు
- ●Sunny Leone | రూ.2400కోట్ల స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు..!
- ●Ravula Sridhar Reddy | స్కూల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని ఎట్లంటరు
- ●Sara Arjun | జెర్సీ డైరెక్టర్‌తో ధురంధర్ 2 హీరోయిన్ తెలుగు మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●LPG Cylinders | ఉజ్వల లబ్ధిదారులకు షాక్.. ఇకపై ఏడాదికి 4 సబ్సిడీ సిలిండర్లే..

Lok Sabha | మరోసారి లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు..?

Rakesh Reddy | ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు

Sunny Leone | రూ.2400కోట్ల స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు..!

Ravula Sridhar Reddy | స్కూల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని ఎట్లంటరు



