త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ – రెండో రోజు స‌గానికిపైగా క‌లెక్ష‌న్స్ డ్రాప్‌

పెద్ది మూవీ క‌లెక్ష‌న్స్ రెండో రోజు స‌గానికిపైగా ప‌డిపోయాయి. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 135 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు మాత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా కేవ‌లం 44 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకొని నిరాశ‌ప‌రిచింది.

N

Entertainment | Published On Jun 6, 2026, 8.28 pm IST

Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ – రెండో రోజు స‌గానికిపైగా క‌లెక్ష‌న్స్ డ్రాప్‌
Advertisement

రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీకి రెండో రోజు గ‌ట్టి షాక్ త‌గిలింది. తొలి రోజు 135 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో పెద్ది రికార్డులు క్రియేట్ చేసింది. సెకండ్ డే మాత్రం క‌లెక్ష‌న్స్ స‌గానికిపైగా డ్రాప్ అయ్యాయి. శుక్ర‌వారం ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ కేవ‌లం 46.44 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 181. 8 కోట్ల క‌లెక్ష‌న్స్ పెద్ది మూవీకి వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు.

మిక్స్‌డ్ టాక్‌...

పెద్ది మూవీకి మిక్స్‌డ్ టాక్ రావ‌డం, నార్త్ ఇండియాలో స‌రైన బ‌జ్ లేక‌పోవ‌డమే క‌లెక్ష‌న్స్ త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. తెలుగు మిన‌హా మిగిలిన భాష‌ల్లో పెద్ది సంద‌డి ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో శుక్ర‌వారం రోజు క‌నీసం యాభై ల‌క్ష‌ల మార్క్‌ను కూడా ట‌చ్ చేయ‌లేదు. జాన్వీ క‌పూర్‌, దివ్యేందు శ‌ర్మ‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ న‌టులు ఈ సినిమాలో ఉండ‌టంతో హిందీలో భారీగానే క‌లెక్ష‌న్స్ రావ‌చ్చున‌ని మేక‌ర్స్ భావించారు. కానీ అంచ‌నాలు పూర్తిగా త‌ప్పాయి. రెండో రోజు పెద్ది హిందీ వెర్ష‌న్ కేవ‌లం 2.25 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకుంది. మూడో రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

క్ష‌మాప‌ణ‌లు...

పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో శృతి హాస‌న్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. జ‌గ‌ప‌తిబాబు, శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పెద్దిపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా భారీగానే వ‌స్తోన్నాయి. జాన్వీ క‌పూర్ పాత్ర‌ను సినిమాలో చూపించిన తీరుపై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావ‌డంతో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జాన్వీ న‌టించిన మూడు నిమిషాల నిడివితో కూడిన కొన్ని సీన్ల‌ను సినిమాలో నుంచి తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement