CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి అని సీఎం హెచ్చరించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి అని సీఎం హెచ్చరించారు. కోహెడ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు తమాషా చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అని అంటున్నరు. అల్లాటప్పాగా రాలేదు తొక్కుకుంటూ వచ్చాం. కార్యకర్తలు కష్టపడితే వచ్చాం, కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటే వచ్చాం. 12 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పంట కొనడం లేదు. మోదీని గద్దె దిగమను, రాహుల్‌ను ప్రధాని చేసి తెలంగాణ పండించిన ప్రతి గింజను కేంద్రంతో కొనిపిస్తాను. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేపిస్తా, మెట్రో విస్తరణకు, రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు తీసుకువస్తాను. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తాను. మీకు మాటలే వచ్చేమో.. మాకు మాటలతో పాటు చేతలు కూడా వస్తాయని సీఎం అన్నారు.
గుండు, అర గుండు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం
15వ తేదీ తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతది.. ఆ తర్వాత వడ్లు, మొక్కజొన్నను కేంద్రం ఎట్ల కొనదో చెప్తా. మెట్రోకు ఎందుకు నిధులు ఇవ్వరో, రీజినల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతివ్వారో, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఎట్ల రాదో చెప్తా.. పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. కేంద్రంలో మోదీ ఉన్నాడని భయపెట్టి చూడాలని చూస్తున్నారో.. మర్యాద వరకు మర్యాద.. మర్యాద దాటితే మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికీ భయపడం.. గుండు, అర గుండు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం అని సీఎం అన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
జూన్ 6, 2026

CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్‌కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!
- ●Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్
- ●CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్
- ●CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్
- ●Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ - రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్

MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్‌కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!

Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్

CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్



