త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | బీఆర్ఎస్ నేత‌లు అడ్డుప‌డ్డా, శాన‌ప‌నార్థాలు పెట్టినా కూడా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ క‌ట్టి తీరుతాం.. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jun 6, 2026, 8.54 pm IST

CM Revanth Reddy | భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ నేత‌లు అడ్డుప‌డ్డా, శాన‌ప‌నార్థాలు పెట్టినా కూడా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ క‌ట్టి తీరుతాం.. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాప‌న అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

గ‌త ప్ర‌భుత్వంపై ప‌దేండ్లు కొట్లాడినం. కాలుష్యాన్ని వెద‌జ‌ల్లే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఓఆర్ఆర్ అవ‌త‌ల‌కు త‌ర‌లించాల‌ని అడిగాం. ఇప్పుడు అవ‌న్నీ చేస్తుంటే ఈనాడు అష్ట ద‌రిద్రులు అడ్డుకుంటున్నారు. ధ‌ర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అభివృద్ధి నిరోధ‌కులుగా మారితే ఈనాడు ప్ర‌తిప‌క్ష హోదా ఉన్న‌ది. ప్ర‌తిప‌క్ష హోద కాదు క‌దా.. కారెక్క‌డానికి కూడా మ‌నిషి దొర‌క‌డు.. టైర్లు లేని కార్ల మాదిరి ఉంట‌ది. మీ అంబాసిడ‌ర్ కారుకు ఆ ప‌రిస్థితి వ‌స్త‌ది అని సీఎం అన్నారు.

మందు వేసుకుని ఫామ్ హౌస్‌లో ప‌డుకున్నాడు

మీ అంద‌రి స‌హ‌కారంతో ఈ ఫ్రూట్ మార్కెట్‌ను శంకుస్థాప‌న చేసుకుంటున్నాం. ఆరు నెల‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి రెండేండ్ల‌లోనే పూర్తి చేయాల‌ని కోరుతున్నా. నిధులు ఆల‌స్యం చేయ‌కుండా 2,400 కోట్లు గ్రీన్ చానెల్‌లో విడుద‌ల చేయించే బాధ్య‌త నాది. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాల‌మూరు ఎత్తిపోత‌ల క‌డుతా అన్న‌డు. మందు వేసుకుని ఫామ్ హౌస్‌లో ప‌డుకున్నాడు. కుర్చీ వేసుకుని కూర్చొని.. 24 గంట‌లు ప‌ని చేయించండి అని మంత్రులు శ్రీధ‌ర్ బాబు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు సూచిస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు.

ఫైవ్ స్టార్ హోట‌ళ్ల మాదిరి ఏసీ గ‌దుల‌తో స‌బ్ రిజిస్ట్రేష‌న్ ఆఫీసులు

ఈనాడు రిజిస్ట్రేష‌న్ ఆఫీసుల్లో కోట్ల రూపాయాల భూముల లావాదేవీలు జ‌రుగుతున్నాయి. స‌బ్ రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో కుర్చీలు లేవు. క‌నీస సౌక‌ర్యాలు ఉండ‌వు. స్మ‌శానికి పోయిన‌ట్టు ఎడారికి పోయిన‌ట్టు ఉంటాయి. ప్ర‌తి ఏడాది రిజిస్ట్రేష‌న్ 16 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నారు. మ‌రి కూర్చోవ‌డానికి కుర్చీ, తాగ‌డానికి చాయ్ లేదు. నిల‌బ‌డ‌డానికి స్థ‌లం లేకుండా పోయింది. అందుకే ఓఆర్ఆర్ లోప‌ల 39 స‌బ్ రిజిస్ట్ర‌ర్ కార్యాల‌యాలు ఉంటే వాటిని 12 క‌స్ల‌ర్‌లుగా విభ‌జించి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల మాదిరి ఏసీ గ‌దుల‌తో వ‌స‌తులు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని సీఎం తెలిపారు.

అసూయ ఉన్న వారికి అజీర్తి అవుతూనే ఉంట‌ది

అంత‌ర్జాతీయ న‌గ‌రం అని గొప్ప‌లు చెప్పుకుంటే స‌రిపోదు. ఆ స్థాయిలో ప్ర‌మాణాలు కూడా ఉండాలి అప్పుడే గుర్తింపు వ‌స్త‌ది. అడ్డంప‌డ్డా, శాప‌నార్థాలు పెట్టినా చివ‌ర‌కు మూసీలో ప‌డి పందుల మాదిరి దొర్లినా వారి మాట‌లు వినేది లేదు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టుకోవాలి. కోహెడ ఫ్రూట్ మార్కెట్‌ను క‌ట్టుకోవాల్సిందే. అసూయ ఉన్న వారికి అజీర్తి అవుతూనే ఉంట‌ది ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసినం. కాళేశ్వ‌రం నీళ్లు లేకుండానే వ‌రి అత్య‌ధికంగా పండించాం. ల‌క్ష కోట్ల రూపాయాలు గోదావ‌రిలో కొట్టుకుపోయాయి. అదే గోదావ‌రిలో బీఆర్ఎస్ నేత‌ల‌కు త‌ద్దినం పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది అని సీఎం అన్నారు.

తాటిచెట్టులాగా పెరిగిండు.. తెలివి ఎక్కువ ఉన్న‌దని అనుకుంటున్న‌డు

తాటిచెట్టులాగా పెరిగిండు.. తెలివి ఎక్కువ ఉన్న‌దని ఆయ‌న అనుకుంటున్న‌డు. ప్రాజెక్టులు ఎట్ల క‌ట్టాలో, లిఫ్ట్ లు ఎట్ల మెయింటెన్ చేయాలో లెట‌ర్లు రాస్తున్నారు హ‌రీశ్‌రావు. ప‌దేండ్లు అట్ల ఏడ్సినందుకు కాళేశ్వ‌రం కూలేశ్వ‌రం అయింది. ఇది కాక‌ర కాయ కాదు కిక‌ర కాయ అన్న‌ట్టు హ‌రీశ్‌రావు సూచ‌న‌లు ఉన్నాయి. నీ దిక్కుమాలిన స‌ల‌హాల‌తో నీ మామ న‌డుము విరిగి ఫామ్ హౌస్‌లో పండుకున్న‌డు అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement