త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను అడ్డుకునేందుకే విజ‌య్‌కి మ‌ద్ద‌తు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స్టాలిన్‌..!

MK Stalin | ఇటీవ‌ల త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాలు సాధించిన విష‌యం తెలిసిందే. సంపూర్ణ మెజారిటీ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్‌తో పాటు ప‌లు పార్టీల‌తో పాటు అన్నాడీఎంకే రెబ‌ల్స్ విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇత‌ర పార్టీలు విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌డంపై డీఎంకే చీఫ్‌, మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

P

National | Published On Jun 6, 2026, 9.30 pm IST

MK Stalin | రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను అడ్డుకునేందుకే విజ‌య్‌కి మ‌ద్ద‌తు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స్టాలిన్‌..!
Advertisement

MK Stalin | ఇటీవ‌ల త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాలు సాధించిన విష‌యం తెలిసిందే. సంపూర్ణ మెజారిటీ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్‌తో పాటు ప‌లు పార్టీల‌తో పాటు అన్నాడీఎంకే రెబ‌ల్స్ విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇత‌ర పార్టీలు విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌డంపై డీఎంకే చీఫ్‌, మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించ‌కుండా అడ్డుకునేందుకు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని స్టాలిన్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ జోక్యాన్ని గవర్నర్ ద్వారా అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో 234 స్థానాలకు టీవీకే 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిందని, అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీని సాధించలేకపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమిలోని సీపీఐ, సీపీఎం, వీసీకేతో పాటు, కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ కూడా టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు. తమ మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని తనను సంప్రదించినప్పుడు.. అది వారి ప్రజాస్వామ్య హక్కు అని భావించి తాను ఎలాంటి అడ్డంకులు పెట్టలేదని స్టాలిన్ వివరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే అధికారంలోకి రాలేదన్న నిరాశ తమకు లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు తమ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదని, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందన్నారు.

Advertisement
Advertisement