Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట – నాచురల్ బ్యూటీతో అనుకొని…
సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న రిలీజ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట. తన బ్యానర్‌లోనే మరో టాప్ హీరోయిన్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నానని సమంత చెప్పింది. ఆ హీరోయిన్ పేరు రివీల్ చేసింది.
Entertainment | Published On Jun 6, 2026, 6.54 pm IST
Samantha | రామ్‌చరణ్ పెద్ది తర్వాత జూన్ నెలలో రిలీజ్ అవుతోన్న సినిమాల్లో సమంత మా ఇంటి బంగారంపై ఎక్కువగా హైప్ నెలకొంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 19న థియేటర్లలోకి రాబోతుంది. హీరోయిన్‌గా నటిస్తూనే భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మా ఇంటి బంగారంతో దాదాపు రెండేళ్ల తర్వాత కథానాయికగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది సమంత.
సమంత కాదు...
కాగా మా ఇంటి బంగారంలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట. సాయిపల్లవి హీరోయిన్‌గా సమంత నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించాలని అనుకున్నారట. ఈ సీక్రెట్‌ను మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో సమంత స్వయంగా రివీల్ చేసింది.
నా బ్యానర్‌లోనే...
సాయిపల్లవి యాక్టింగ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆమె హీరోయిన్‌గా నా బ్యానర్‌లోనే మా ఇంటి బంగారం సినిమా చేయాలని అనుకున్నా. కానీ ఆ టైమ్‌లో సాయిపల్లవి బిజీగా ఉండటంతో కుదరలేదు. దాంతో ఈ సినిమాలో నేనే హీరోయిన్‌గా నటించాల్సివచ్చింది. సాయిపల్లవి తప్పుకోవడంతో నా ఇమేజ్‌కు తగ్గట్లుగా మేకర్స్ కథలో చాలా మార్పులు చేశారు అని సమంత అన్నది. భవిష్యత్తులో తప్పకుండా సాయిపల్లవి హీరోయిన్‌తా తన బ్యానర్‌లో సినిమా చేస్తానని సమంత చెప్పింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
యాక్షన్ రోల్....
మా ఇంటి బంగారం మూవీలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లేను రాజ్ నిడిమోరు అందించారు. ఓ పెద్దింటిలోకి కోడలిగా అడుగుపెట్టిన యువతి కథతో మా ఇంటి బంగారం రూపొందుతోంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి పోరాటం చేసింది అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో యాక్షన్ రోల్‌లో సమంత కనిపించబోతున్నది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ – రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్
జూన్ 6, 2026

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ – మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
జూన్ 6, 2026

Peddi | ట్రోల్స్ ఎఫెక్ట్ – క్షమాపణల చెప్పిన పెద్ది డైరెక్టర్ – జాన్వీ కపూర్ ముద్దు సీన్లు కట్
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్
- ●Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ - రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్
- ●Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
- ●CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్

CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి

CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

Peddi | పెద్ది మూవీకి భారీ షాక్ - రెండో రోజు సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ



