త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | ఒలింపిక్ బాక్స‌ర్‌పై మ‌ర్డ‌ర్ కేస్‌ – పెద్ది విల‌న్ బాలీవుడ్ వెబ్‌సిరీస్ – ఎందులో చూడాలంటే?

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది ఫేమ్ దివ్యేందు శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో గ్లోరీ పేరుతో ఓ హిందీ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సిరీస్ మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Apr 7, 2026, 4.45 pm IST

Web Series | ఒలింపిక్ బాక్స‌ర్‌పై మ‌ర్డ‌ర్ కేస్‌ – పెద్ది విల‌న్ బాలీవుడ్ వెబ్‌సిరీస్  – ఎందులో చూడాలంటే?
Advertisement

Web Series | రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీతో బాలీవుడ్ న‌టుడు దివ్యేందు శ‌ర్మ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా మూవీలో రామ్‌బుజ్జి అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. నెగెటివ్ షేడ్స్‌తో దివ్యేందు పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం.

నెట్‌ఫ్లిక్స్‌లో...

తాజాగా దివ్యేందు ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాడు. గ్లోరీ పేరుతో తెర‌కెక్కిన‌ ఈ సిరీస్ మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో దివ్యేందు శ‌ర్మ‌తో పాటు పుల్కిత్ సామ్రాట్‌, సువీంద‌ర్ విక్కీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రానానాయుడు ఫేమ్ క‌ర‌ణ్ అన్షుమాన్‌, క‌నిష్క్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

ట్రైల‌ర్ రిలీజ్‌...

గ్లోరీ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ పోటీలు, యాక్ష‌న్ అంశాల‌తో పాటు రివేంజ్‌, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ట్రైల‌ర్ గ్రిప్పింగ్‌గా సాగింది. ఒలింపిక్స్‌లో పాల్గొన‌డ‌మే కాకుండా భార‌త్‌కు బాక్సింగ్‌లో మెడ‌ల్‌ను సాధించిపెట్టాల‌ని క‌ల‌లు క‌న్న ఓ బాక్స‌ర్ అనుకోకుండా ఓ హ‌త్య‌నేరంలో నిందితుడిగా ఎలా మారాడు? ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో అత‌డు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ సిరీస్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యాడు దివ్యేందు శ‌ర్మ‌. మున్నా పాత్ర‌లో దివ్యేందు యాక్టింగ్‌, డైలాగ్స్‌, మ్యాన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. మీర్జాపూర్ హిట్‌తో హిందీలో న‌టుడిగా దివ్యేందు శ‌ర్మ బిజీ అయ్యారు.

ఏప్రిల్ 30న రిలీజ్‌...

పెద్దిలో విల‌న్‌గా దివ్యేందు పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement