త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | ఒకే ఫ్రేమ్‌లో ధోనీ , రామ్‌చ‌ర‌ణ్ – స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే పార్టీలో మెగా ప‌వ‌ర్ స్టార్‌

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే వేడుక‌లు శ‌నివారం ముంబాయిలో జ‌రిగాయి. ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నారు. పార్టీలో స‌ల్మాన్ ఖాన్‌, ధోనీల‌తో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌దాగా ముచ్చ‌టిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

N

Entertainment | Published On Dec 28, 2025, 6.22 pm IST

Ram Charan | ఒకే ఫ్రేమ్‌లో ధోనీ , రామ్‌చ‌ర‌ణ్ – స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే పార్టీలో మెగా ప‌వ‌ర్ స్టార్‌

రామ్‌చ‌ర‌ణ్

Advertisement

Ram Charan | బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ముంబాయిలో శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ప‌న్వేల్‌లోని త‌న ఫౌమ్‌హౌజ్‌లో ఈ వేడుక‌ల‌ను ఏర్పాటుచేశారు స‌ల్మాన్ ఖాన్‌. ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కురామ్‌చ‌ర‌ణ్ అటెండ్ అయ్యారు. ఈ పార్టీకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా చ‌ర‌ణ్ నిలిచారు. ఈ బ‌ర్త్‌డే లో స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan), ధోనీ (Dhoni), బాబీడియోల్‌ల‌తో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌దాగా ముచ్చ‌టిస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో క్లాస్ లుక్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్‌ క‌నిపిస్తున్నారు.
టాలీవుడ్ నుంచి కేవ‌లం మెగా ఫ్యామిలీకి మాత్ర‌మే స‌ల్మాన్ బ‌ర్త్‌డే పార్టీకి ఆహ్వానం అందిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి కూడా పార్టీలో పాల్గొనాల్సింద‌ట‌. కానీ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల వ‌ల్ల హాజ‌రుకాలేక‌పోయిన‌ట్లు స‌మాచారం. మెగా ఫ్యామిలీ నుంచి చ‌ర‌ణ్ ఒక్క‌డే స‌ల్మాన్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో పాల్గొన్న‌ట్లు తెలిసింది. ఈ పార్టీకి రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ, సంజ‌య్ ద‌త్‌, బాబీ డియోల్‌, క‌రిష్మా క‌పూర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, జెనిలీయా తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు అటెండ్ అయ్యారు.

గాడ్ ఫాద‌ర్‌లో గెస్ట్ రోల్‌...

మెగా ఫ్యామిలీతో స‌ల్మాన్ ఖాన్‌కు చ‌క్క‌టి అనుబంధం ఉంది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను త‌న కుటుంబంలో ఓ స‌భ్యులుగానే భావిస్తాన‌ని గ‌తంలో ప‌లు వేడుక‌ల్లో స‌ల్మాన్ ఖాన్ చెప్పారు. రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ జంజీర్ నిర్మాణంలో స‌ల్మాన్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అంతే కాకుండా చిరంజీవితో ఉన్న అనుబంధంతోనే ఆయ‌న హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్‌లో స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు.

పెద్ది మూవీ...

ప్ర‌స్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 2026 మార్చి 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. పెద్ది మూవీలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పెద్ది త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు చ‌ర‌ణ్‌.

ALSO READ Thalapathy Vijay | సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన ద‌ళ‌ప‌తి విజ‌య్ – అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన కోలీవుడ్ హీరో

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement