త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ – ఇంద్ర‌లోకం నుంచి అప్స‌ర‌స‌లు భూమిపైకి వ‌స్తే !

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన రొమాంటిక్ ఫాంట‌సీ కామెడీ మూవీ రంభ ఊర్వ‌శి మేన‌క ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. సుర‌భి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో విష్ణుప్రియ‌, రాశీ సింగ్‌, ప్రిషా సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

N

Entertainment | Published On Sep 24, 2026, 4.45 pm IST

Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ – ఇంద్ర‌లోకం నుంచి అప్స‌ర‌స‌లు భూమిపైకి వ‌స్తే !
Advertisement

Vishnu Priya |  యాంక‌ర్ విష్ణుప్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు రొమాంటిక్ ఫాంట‌సీ కామెడీ మూవీ రంభ ఊర్వ‌శి మేన‌క థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు చంద్ర‌మోహ‌న్ చింతాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుర‌భి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో విష్ణుప్రియ‌తో పాటు రాశీసింగ్‌, ప్రిషా సింగ్‌, సీనియ‌ర్ న‌రేష్, వెన్నెల‌కిషోర్‌ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌న‌కు అచ్చొచ్చిన కామెడీ జాన‌ర్‌లో అల్ల‌రి న‌రేష్ ఈ సినిమా చేశాడు. కానీ విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు.

అమెజాన్ ప్రైమ్‌లో...

తాజాగా రంభ ఊర్వ‌శి మేన‌క ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. గురువారం రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ అనుకున్న స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా ప‌రాజ‌యానికి కార‌ణ‌మైంది. విష్ణుప్రియ‌, రాశీసింగ్ గ్లామ‌ర్ కూడా రంభ ఊర్వ‌శి మేన‌కు కాపాడ‌లేక‌పోయింది.

అన్న‌పూర్ణ స్టూడియోస్...

హాస్య మూవీస్‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు. సూరి సినిమాల్లో హీరో కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలేవి చేయ‌కుండా బాబాయ్‌తో పాటు స్నేహితుడితో బ‌లాదూర్ తిరుగుతూ దొరికిన చోట‌ల్లా అప్పుడు చేస్తుంటాడు. అప్స‌ర‌స‌లైన రంభ ఊర్వ‌శి మేన‌కల‌ను భూమిపైకి దిగివ‌చ్చే ఓ పురాత‌నం కాలం నాటి గ్రంథం సూరి ద‌గ్గ‌ర ఉంటుంది. ఆ గ్రంథం స‌హాయంతో అప్స‌ర‌సను కిందికి దిచ్చి వారి ద్వారా త‌న క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటాడు. సూరి కోరుకున్న‌ట్లే అప్స‌ర‌స‌లు భూమిపైకి వ‌స్తారు. కానీ ఇంద్రుడి శాపం కార‌ణంగా వారికి శ‌క్తుల‌న్నీ పోతాయి. వారి కార‌ణంగా సూరి క‌ష్టాలు రెట్టింపు అవుతాయి. ఆ త‌ర్వాత ఏమైంది? త‌న త‌ల్లితో పాటు ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవ‌డం కోసం సూరి ఏం చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement